Chanakya Niti: పాలకులకు.. మిత్రుడు అంటే ఎవరు.. ఎవరితో స్నేహం చేయాలో చెప్పిన చాణక్య..

Chanakya Niti: ఆచార్య చాణక్య ప్రతిభ నిరుపమానం. ఎవరైనా ఏదైనా గొప్ప ఆలోచన చెబితే వారిని " అపర చాణక్యుడు" అంటూ కీర్తిస్తాం.  ఆనాటి అఖండ భారత సార్వ భౌమత్వానికి ముప్పులేకుండా చేయగల్గిన మేధావి చాణక్యుడు. పాలకుల పరిపాన,..

Chanakya Niti: పాలకులకు.. మిత్రుడు అంటే ఎవరు.. ఎవరితో స్నేహం చేయాలో చెప్పిన చాణక్య..
Chanakya Niti
Follow us
Surya Kala

|

Updated on: Aug 28, 2021 | 7:05 AM

Chanakya Niti: ఆచార్య చాణక్య ప్రతిభ నిరుపమానం. ఎవరైనా ఏదైనా గొప్ప ఆలోచన చెబితే వారిని ” అపర చాణక్యుడు” అంటూ కీర్తిస్తాం.  ఆనాటి అఖండ భారత సార్వ భౌమత్వానికి ముప్పులేకుండా చేయగల్గిన మేధావి చాణక్యుడు. పాలకుల పరిపాన, వ్యవసాయం లాభ సాటిగా చేయటాన్ని ,పశువుల పెంపకం ,యాజమాన్య పద్ధతులు ,వనమూలికలు ,ఔషధాలు ,ఆయుధాల తయారీ ,అడవి జంతువుల సంరక్షణ ,కరువులు రాకుండా చేసే ఉపాయాలు వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, గూఢ చారి వ్యవస్థ, సంస్థల నిర్వహణ విధానం, యుద్ధ నీతి, యుద్ధ ఖైదీలను చూడాల్సిన పద్ధతులు, క్రమశిక్షణ వంటి నేటి సమాజానికి ఉపయోగపడే అనే విషయాలను తెలియజెప్పాడు. వీటిని చాణక్య నీతి అంటాం.. ఈరోజు చాణుక్యుడు చెప్పిన నియమాలు.. మిత్రుడు అంటే ఎవరు..అతడు ఎలా స్నేహితుడికి అండగా ఉంటాడో తెలుసుకుందాం..

*ఎవరైనా ఎదుటివారిని సహాయం అర్ధించే ముందు.. ఆత్మని సంపాదించుకున్న తరువాత, అనగా తనకు తాను చక్కబరుచుకున్న తరువాత సహయాన్ని సంపాదించడం కోసం ప్రయత్నించాలి. * స్నేహితుడు కదా అని విద్యావినయం లేనివాడిని మంత్రిగా చేసుకోకూడదు. * ఆలోచనలు బయటపెట్టినవాడు అన్ని పనులు చెడగొట్టుకుంటాడు. ఆలోచనలు చాలా రహస్యంగా ఉంచడం ముఖ్యం. * ఆపదలో అండగా ఉన్నవాడే మిత్రుడు. అటువంటి మిత్రులను సంపాదించుకుంటే బలం చేకూరుతుంది. * లేనిదాన్ని సంపాదించడం, సంపాదించినదాన్ని రక్షించుకోవడం, దాన్ని వృద్ధి పొందించుకోవడం, తగినరీతిలో వినియోగించుకోవడం, ఈ నాలుగింటినే  రాజ్యతంత్రం అంటారు. *రాజ్యానికి రాజ్యానికి మధ్య ఒక రాజ్యం అడ్డు ఉంటె.. మధ్య రాజ్యం వాడు మిగిలిన ఇద్దరికీ సహజ శత్రువు.. అయితే ఏదో ఒక కారణాన్ని బట్టి కూడా శత్రువు.. మిత్రులు అవుతుంటారు. * బలం తగ్గిపోయినవాడు సంధి చేసుకోవాలి. బలం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత కాదు. * బలంగా ఉన్నవాడు తనకంటే తక్కువ బలం ఉన్నవాడితో విరోధం పెట్టుకోవాలి. తనకంటే ఎక్కువ బలం ఉన్నవాడితో గాని , సమానమైనవానితో గాని విరోధం పెట్టుకోకూడదు . * శత్రువు చేస్తున్న ప్రయత్నాలు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. చాలా మంది శత్రువులు ఉన్నప్పుడు ఒకరితో సంధి చేసుకొని రెండోవానిపై యుద్ధానికి వెళ్ళాలి. * జూద వ్యసనం ఉన్నవాడు ఏ పని సాధించలేడు. వేట వ్యసనం ఉన్నవాని ధర్మం, అర్థం కూడా నశిస్తాయి.  కామంపై ఆసక్తి ఉన్నవాడు ఏ పని చేయలేడు . * రాజుకి ధనాసక్తి ఉండటం వ్యసనంగా పరిగణించబడదు. ఉన్న ధనం చాలులే అనుకునే రాజుని లక్ష్మి వదిలేస్తుంది. * సహాయం చేసే వ్యక్తి లేనివాడు ఏ విషయంలోనూ ఒక నిర్ణయానికి రాలేడు. సుఖ దుఃఖాలు సమానంగా పంచుకున్నవాడే సహాయకుడు.

Also Read: ఈ రాశులవారు నమ్మదగినవారు కాదు.. సీక్రెట్స్ అస్సలు పంచుకోవద్దు..!