Free Internet: హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఫ్రీ ఇంటర్నెట్.. ఉచిత సేవలను ఇలా పొందండి. యాక్ట్ యూజర్లకు ప్రత్యేకంగా..
Free Internet: ప్రముఖ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యాక్ట్ ఫైబర్ హైదరాబాద్ నగరంలో ఉచితంగా ఇంటర్‌నెట్ సదుపాయాన్ని అందించింది. కేవలం ఇంట్లోనే కాకుండా నగరవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా తమ యూజర్లు...
Free Internet: ప్రముఖ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యాక్ట్ ఫైబర్ హైదరాబాద్ నగరంలో ఉచితంగా ఇంటర్‌నెట్ సదుపాయాన్ని అందించింది. కేవలం ఇంట్లోనే కాకుండా నగరవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా తమ యూజర్లు ఇంటర్‌నెట్‌ను యాక్సిస్ చేసుకునేలా అవకాశాన్ని ఇచ్చింది. ఇందు కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో ఉచితంగా వైఫై జోన్లు ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, యాక్ట్ సంస్థలు సంయుక్తంగా హై-ఫై ప్రాజెక్టును చేపట్టాయి. ఇందులో భాగంగానే ఆగస్టు మొదటి వారంలో నగర వ్యాప్తంగా మూడు వేలకుపైగా ఫ్రీ వైఫై జోన్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇక కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా వరంగల్‌లోనూ ఉచిత వైఫై సేవలను అందించనున్నట్లు యాక్ట్ సంస్థ తెలిపింది. ఇక్కడ మొత్తం 18 ఉచిత వైఫై సెంటర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది.
యాక్ట్ యూజర్ల కోసం..
ఇదిలా ఉంటే యాక్ట్ ఇంటర్నెట్ సంస్థ ఫైబర్ టెక్నాలజీ సాయంతో తన వినియోగదారులకు ఇంటి బయట కూడా ఇంటర్నెట్‌ను వినియోగించుకునేలా అవకాశం కలిపించింది. సాధారణంగా మనం ఇంట్లో ఏ ప్లాన్‌ను ఉపయోగిస్తున్నామో. ఫ్రీ వైఫై జోన్ల వద్ద కూడా అదే ప్లాన్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఉచిత ఇంటర్నెట్‌ను వాడుకునే వారికి 25 ఎంబీపీఎస్ స్పీడ్‌తో కేవలం 45 నిమిషాల పాటే నెట్ అందిస్తారు. అయితే యాక్ట్ సబ్‌స్క్రైబర్స్ మాత్రం ఇంటి దగ్గర ప్లాన్ ప్రకారం ఎక్కువ స్పీడ్‌తో ఎంత సేపైనా అన్‌లిమిటెడ్‌గా నెట్‌ను వాడుకునే వీలు ఉంటుంది. అదే విధంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న 47 మెట్రో స్టేషన్లలో కూడా ఈ నెట్ సౌక్యర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఉచిత వైఫై ఇలా పొందాలి..
* ఉచిత ఇంటర్నెట్ పొందాలంటే ఉచిత వైఫై ఉన్న జోన్‌లోకి వెళ్లాలి. * అనంతరం వై-ఫై సెట్టింగ్స్‌లో ACT Free HY-Fi ని ఎంచుకోవాలి * తర్వాత మీ రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. వెంటనే ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయాలి. * కేటాయించిన కాల పరిమితి ముగిసిన తర్వాత రూ. 25, రూ. 50తో టాప్‌ఆప్ పొందవచ్చు. యాక్ట్ వినియోగదారులకైతే ఇంటి దగ్గర ప్లాన్‌ను బయట కూడా వాడుకోవచ్చు.
Also Read: Gold Price Today: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పసిడి.. మరోసారి పెరిగిన ధరలు..
Director RGV: బిగ్ బాస్ బ్యూటీ హాట్ ఫోటో షేర్ చేసిన ఆర్జీవీ.. ఫోటో తీసిందెవరో చెప్పాలంట..
మరో రెండు గ్రహాలను కనుగొన్న శాస్త్రవేత్తలు.. నీరు, హైడ్రోజన్ ఉన్న ఆ గ్రహాలపై ఏలియన్స్ ఉన్నారా ?