- Telugu News Photo Gallery World photos Know new class of exoplanets called hycean planets could support aliens
మరో రెండు గ్రహాలను కనుగొన్న శాస్త్రవేత్తలు.. నీరు, హైడ్రోజన్ ఉన్న ఆ గ్రహాలపై ఏలియన్స్ ఉన్నారా ?
భూమిలాగే ఉన్న మరో రెండు గ్రహాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ బృందం జీవం ఉన్న హైషన్ అనే గ్రహాలను కనుగొన్నారు.
Updated on: Aug 27, 2021 | 10:16 PM

ఖగోళ శాస్త్రవేత్తలు 'వాటర్‌వరల్డ్' ఎక్సోప్లానెట్‌లను కనుగొన్నారు. ఈ ఎక్సోప్లానెట్‌లు వెచ్చగా ఉన్నట్లుగా కనిపెట్టారు. అవి సముద్రం ద్వారా కప్పబడి హైడ్రోజన్‌తో సమృద్ధిగా ఉన్నాయని.. వాటిపై కూడా జీవులు నివసించే అవకాశం ఉందని కనుగొన్నారు.

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం బృందం ఈ ఎక్సోప్లానెట్‌లకు 'హైషన్' వరల్డ్ అని పేరు పెట్టింది. ఈ గ్రహాలపై ఏలియన్స్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.

ఇతర గ్రహాలపై మానవ మనుగడ సాధ్యమేనా అనే కోణంల శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. భూమి పరిమాణం, ద్రవ్యరాశి, ఉష్ణోగ్రత, వాతావరణ మార్పులకు సరిపోయే గ్రహాలను కనుగునే పనిలో ఉన్నారు. మనుషులు జీవించేందుకు వీలైన గ్రహాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ హాయాసిన్ అనే గ్రహం మాత్రం భూమి లాంటి మిగతా గ్రహాల కంటే ఎక్కువ.

ఈ ఎక్సోప్లానెట్స్ భూమి లాంటి గ్రహాల కంటే ఎక్కువ నివాసయోగ్యమైనవి. వాటిపై హైడ్రోజన్ అధికంగా ఉండే వాతావరణం.. మెరుగైన ఉష్ణోగ్రతలు.. సముద్రాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది కాకుండా ప్రస్తుత టెలిస్కోపుల ద్వారా వాటిని కనుగొనడం కూడా సులభమే అని అంటున్నారు శాస్త్రవేత్తలు.

ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం ఈ ఫలితాలు మన సౌర వ్యవస్థ కంటే రెండు మూడు సంవత్సరాలలో జీవరాశి ఉండవచ్చు. కేంబ్రిడ్జ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీకి చెందిన డాక్టర్ నిక్కు మధుసూదన్ ఈ ఆవిష్కరణతో విశ్వంలో జీవం కనుగొనడానికి కొత్త మార్గం కనుగొన్నట్లుగా తెలిపారు.

ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించిన హైసిన్ గ్రహాలు భూమి కంటే పెద్దవి, ఉష్ణోగ్రత కూడా ఎక్కువగానే ఉంది. భూమి యొక్క కొన్ని కఠినమైన నీటి వాతావరణాలలో కనిపించే సూక్ష్మజీవుల బ్రతుకేందుకు సహయపడే పెద్ద మహాసముద్రాలు ఉండవచ్చు.




