Telangana News: మండుతున్న మేడ్చల్.. నాయకుల మధ్య హద్దులు దాటుతున్న మాటల యుద్ధం..
Telangana Politics: రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఆ జిల్లా బర్నింగ్ టాపిక్. ప్రధాన రాజకీయా పార్టీల మధ్య జరుగుతున్న మాటల తూటాలతో ఆ జిల్లా మండుతుంది.
Telangana Politics: రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఆ జిల్లా బర్నింగ్ టాపిక్. ప్రధాన రాజకీయా పార్టీల మధ్య జరుగుతున్న మాటల తూటాలతో ఆ జిల్లా మండుతుంది. ఆ నలుగురు నాయకుల సవాళ్లు.. ప్రతిసవాళ్ళతో మేడ్చల్ భగ్గుమంటుంది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వివాదం సద్దుమణగక ముందే కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ మొదలయింది. ఈసారి మాత్రం మేడ్చల్ జిల్లా రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది. హద్దులు దాటిన మాటలతో ఆ జిల్లా మండిపోతుంది. అధికార పార్టీ విపక్ష పార్టీల ముఖ్య నాయకుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంతో టీఆర్ఎస్ నాయకుల ఇళ్లపై అటాక్‌ల వరకు వెళ్ళింది. మొన్నటికి మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కు మధ్య చెలరేగిన వివాదం ఎంత స్థాయికి వెళ్లిందో మనం చూశాం. చివరకు జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం వరకు వెళ్లడం, కేసులు బుక్ అవ్వడం కూడా జరిగినా ఇంకా ఆ ఇష్యూ నీవురు గప్పిన నిప్పులా ఉన్న విషయం తెలిసిందే. అది అలా ఉండగానే అదే జిల్లాలో మరో హాట్ టాపిక్ మొదలయింది.
మేడ్చల్ జిల్లా మూడుచింతల పల్లిలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దీక్ష కార్యక్రమం చేపట్టడం, ఆ సందర్భంగా మేడ్చల్ జిల్లా మంత్రి మల్లారెడ్డి పై ఘాటుగా విమర్శలు చేయడం వివాదానికి ఆజ్యం పోసింది. అయితే, దీనికి దీటుగా మంత్రి మల్లారెడ్డి చెలరేగిపోవడం.. తొడగొట్టడం.. రాజీనామాలకు సవాళ్లు విసరడంతో మరోసారి మేడ్చల్ జిల్లా భగ్గుమంది. రేవంత్ రెడ్డిపై మంత్రి విరుచుకుపడ్డారు. ‘‘నేను రాజీనామా చేస్తా.. నువ్ కూడా రాజీనామా చేసి మళ్ళీ గెలువు..’’ అనడంతో పాటు మాటల తూటాలు పెల్చడంతో కాంగ్రెస్ నాయకులు మంత్రి మల్లారెడ్డి ఇంటిని ముట్టడించారు. దాంతో అక్కడ యుద్ద వాతావరణం నెలకొంది. ఇలా ఒకటి తరువాత ఒకటి మేడ్చల్ జిల్లాను రాజకీయంగా రగుల్చుతున్నారు. టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల మాటల యుద్దం.. మేడ్చల్ జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా పిక్ స్టేజికి తీసుకెళ్లాయి. జరుగుతున్న సీన్ చూస్తే ఇది ఇక్కడితే క్లోజ్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. మరి ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో చూద్దాం.
(రిపోర్టర్: శ్రీధర్ ప్రసాద్, టీవీ9 తెలుగు)
Also read:
TRS Party: సీఎం కేసీఆర్ నామకరణం.. ‘‘రామ’’ నామంతో రుణం తీరిందంటున్న దంపతులు..
Pakistan : అత్యాచారాలు జరిగేది దానివల్లే.. పాక్ ప్రధాని విచిత్ర విశ్లేషణ.. సోషల్ మీడియాలో మాత్రం..