AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS Party: సీఎం కేసీఆర్ నామకరణం.. ‘‘రామ’’ నామంతో రుణం తీరిందంటున్న దంపతులు..

CM Kcr: కుటుంబ కలహాలతో విడిపోయిన దంపతులను ఎంపీటీసీ ఎన్నికలు ఏకం చేశాయి. ఆ దంపతులకు బాబు పుట్టడంతో సీఎం కేసీఆర్.. ఆ బాబుకు కేటీఆర్ గా నామకరణం చేశారు.

TRS Party: సీఎం కేసీఆర్ నామకరణం.. ‘‘రామ’’ నామంతో రుణం తీరిందంటున్న దంపతులు..
Cm Kcr 2
Shiva Prajapati
|

Updated on: Aug 27, 2021 | 10:27 PM

Share

CM Kcr: కుటుంబ కలహాలతో విడిపోయిన దంపతులను ఎంపీటీసీ ఎన్నికలు ఏకం చేశాయి. ఆ దంపతులకు బాబు పుట్టడంతో సీఎం కేసీఆర్.. ఆ బాబుకు కేటీఆర్ గా నామకరణం చేశారు. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వివరాల్లోకి వెళితే, రామడుగు మండలం ఎంపీపీ కలికేటి కవిత, లక్ష్మణ్ దంపతులు. వీరికి ఎనిమిదేండ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఇద్దరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. అవి చిలికి చిలికి గాలి వానగా మారి వారి వివాహ బంధానికి తెర పడే వరకు వచ్చింది. తాము ఇక కలిసి ఉండలేమని, విడాకులే శరణ్యమని ఆ దంపతులు ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు కూడా. ఈ నేపధ్యంలో రెండేళ్ల క్రితం ఎంపీటీసీ ఎన్నికలొచ్చాయి. ఈ ఎన్నికల్లో రామడుగు మండలం ఎంపీటీసీ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. కాగా మండలంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుడుగా ఉన్న కలికేటి లక్ష్మణ్ పార్టీ టికెట్‌ను ఆశించారు. తమ తల్లికి ఎంపీటీసీ టికెట్ ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ను కోరారు. అయితే, లక్ష్మణ్ అభ్యర్థనను ఎమ్మెల్యే తిరస్కరించారు. విడిపోయిన భార్యతో కలిసి ఉంటేనే నీకు టికెట్ ఇస్తానని షరతు విధించారు. దాంతో.. అప్పటి వరకూ విడిపోదామనుకున్న భార్యతో లక్ష్మణ్ కలిశాడు. ఎమ్మెల్యే మధ్యవర్తిత్వంతో.. వారిరువురూ మళ్లీ ఒక్కటయ్యారు.

ఆ తరువాత ఇచ్చిన మాట ప్రకారం లక్ష్మణ్ భార్య కవితకు ఎంపీటీసీగా టికెట్ ఇచ్చారు ఎమ్మెల్యే. అలా ఆమె ఎంపీటీసీగా గెలవడం.. ఆ తరువాత ఎంపీపీగా ఎంపికవడం కూడా జరిగింది. అప్పటి నుంచి ఈ దంపతులిద్దరూ అన్యోన్యంగా జీవితాన్ని గడిపారు. వారికి ఇటీవలే కుమారుడు జన్మించాడు. తమను తిరిగి కలిపింది పార్టియే కాబట్టి, పార్టీకి తమ రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవాలని ఆలోచించిన ఆ జంట, తమ కొడుక్కు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు పెట్టుకొని పార్టీ రుణం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ చేతుల మీదుగా నామకరణం చేయించుకోవాలని, గత రెండు నెలలుగా ఎదురుచూశారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం నాటి పర్యటనలో భాగంగా కరీంనగర్‌కు వచ్చిన సీఎం కేసీఆర్‌ను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలిసి అదే విషయాన్ని అభ్యర్థించారు. వారి కోరికను అంగీకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ చిన్నారిని ఎత్తుకుని “ కేటీఆర్’’ అని నామకరణం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తమ కొడుక్కి నామకరణం చేయడంతో ఆ దంపతులు ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు.

Also read:

Pakistan : అత్యాచారాలు జరిగేది దానివల్లే.. పాక్ ప్రధాని విచిత్ర విశ్లేషణ.. సోషల్ మీడియాలో మాత్రం..

Andhra Pradesh: అంతా ఆ బియ్యం వల్లే అంటున్న జనాలు.. అదేం లేదంటున్న అధికారులు.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..

Telangana: యాక్షన్ బట్టి రియాక్షన్.. రేవంత్ vs మల్లారెడ్డి ఎపిసోడ్‌పై కేటీఆర్ హాట్ కామెంట్స్..