AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas Adipurush: ఆదిపురుష్‌ ప్రమోషన్‌కోసం భారీ సాంగ్‌.. నాలుగు రోజుల నుంచి కసరత్తులు చేస్తున్న ప్రభాస్‌.

Prabhas Adipurush: యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పేరు ఇప్పుడో సెన్సేషన్. ఈ హీరో సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా ఇప్పుడది జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌లోకి రావాల్సిందే. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా...

Prabhas Adipurush: ఆదిపురుష్‌ ప్రమోషన్‌కోసం భారీ సాంగ్‌.. నాలుగు రోజుల నుంచి కసరత్తులు చేస్తున్న ప్రభాస్‌.
Narender Vaitla
|

Updated on: Aug 28, 2021 | 7:15 AM

Share

Prabhas Adipurush: యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పేరు ఇప్పుడో సెన్సేషన్. ఈ హీరో సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా ఇప్పుడది జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌లోకి రావాల్సిందే. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా నేషనల్‌ హీరోగా మారిన ప్రభాస్‌ను జాతీయ మీడియా కూడా ఎప్పుడూ ఫాలో అవుతూనే ఉంది. ఇక డార్లింగ్‌ సినిమాలపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. ఇప్పుడు ప్రభాస్‌ సినిమా అంటే కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాదు.. అది ఒక ఇండియన్‌ సినిమాగా మారిపోయింది. దీంతో అభిమానుల అంచనాలే కాకుండా ఇండస్ట్రీ దృష్టి కూడా ప్రభాస్‌ సినిమాపై పడుతోంది. దీంతో ప్రభాస్‌తో సినిమాలు చేసే మేకర్స్‌ ఆచితూచి తెరకెక్కిస్తున్నారు.

సాహో తర్వాత మళ్లీ సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించని ప్రభాస్‌ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ జాబితాలోకే వస్తుంది బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కిస్తోన్న ఆదిపురుష్‌. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో నటిస్తుండగా సీతగా కృతీ సనన్‌, లక్ష్మణుడిగా సన్నీసింగ్‌, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఓంరౌత్‌ సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఇప్పటికే గ్రాఫిక్స్‌కు పెద్ద పీఠ వేసిన ఓంరౌత్‌.. ఇందుకోసం ఏకంగా అంతర్జాతీయ టెక్నీషియన్స్‌ను ఉపయోగించుకుంటున్నాడు.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో ఓ భారీ బడ్జెట్‌ పాట ఉండనుందని తెలుస్తోంది. ఈ పాట కోసమే ప్రస్తుతం ప్రభాస్‌, కృతీ సనన్‌, సైఫ్‌ అలీఖాన్‌ కసరత్తులు చేస్తున్నారని తెలుస్తోంది. ఇందు కోసం వీరు నాలుగు రోజుల నుంచి ఓ స్టూడియోలో కసరత్తులు చేస్తున్నారని సమాచారం. మరో వారం రోజుల్లో ఈ పాట షూటింగ్‌ను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ పాట సినిమా ప్రమోషన్‌కోసం తెరకెక్కిస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోన్న విషయం తెలిసిందే.

Also Read: Director RGV: బిగ్ బాస్ బ్యూటీ హాట్ ఫోటో షేర్ చేసిన ఆర్జీవీ.. ఫోటో తీసిందెవరో చెప్పాలంట..

Karuna Kumar: సినిమా కంప్లీట్.. నెక్ట్స్ మెగా వెబ్ సిరీస్.. పలాస డైరెక్టర్ భారీ ప్రయోగం.. !

Bandla Ganesh: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్.. కాదనలేకపోయినా బండ్ల గణేశ్.. ఆసక్తికర ట్వీట్..