AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Rajnath Singh: ఆర్మీ జవాన్లతో ఉల్లాసంగా గడిపిన రక్షణ శాఖ మంత్రి.. ఓ వైపు జవాన్లు పాడుతుంటే.. జత కలిపిన రాజ్ నాథ్ సింగ్

దిన్ జన్ మిలటరీ స్టేషన్‌లోని ఆర్మీ జవాన్లతో రక్షణ శాఖ మంత్రి మాట్లాడారు.  ఈ సందర్భంగా కొందరు జవాన్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ‘బోర్డర్’ సినిమాలో గీతాన్ని ఆలపించారు  ఓ వైపు జవాన్లు పాట పాడుతుండగా రాజ్ నాథ్ సింగ్ తన స్వరాన్ని జత కలిపారు.

Minister Rajnath Singh: ఆర్మీ జవాన్లతో ఉల్లాసంగా గడిపిన రక్షణ శాఖ మంత్రి.. ఓ వైపు జవాన్లు పాడుతుంటే.. జత కలిపిన రాజ్ నాథ్ సింగ్
Rajnath Singh With Jawans
Surya Kala
|

Updated on: Sep 29, 2022 | 12:28 PM

Share

Minister Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దేశం కోసం నిరంతరం శ్రమించే ఆర్మీ జవాన్లతో ఆడిపాడారు. వారితో కలిసి ఎంజాయ్ చేశారు. ఈ ఘటన అస్సాంలోని దింజన్‌లో ఆర్మీ ఫార్మేషన్‌ను సందర్శించిన సందర్భంగా చోటు చేసుకుంది. దేశంలోని తూర్పు భాగంలో ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణ సంసిద్ధతను రాజ్‌నాథ్ సింగ్ సమీక్షించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లలో మూడు రోజుల పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్, ఈస్టర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ఆర్‌పి కలితతో పాటు ఇతర సీనియర్ అధికారులతో కలిసి పలు ప్రాంతాలను సందర్శించారు.

దిన్ జన్ మిలటరీ స్టేషన్‌లోని ఆర్మీ జవాన్లతో మాట్లాడారు.  ఈ సందర్భంగా కొందరు జవాన్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ‘బోర్డర్’ సినిమాలో గీతాన్ని ఆలపించారు  ఓ వైపు జవాన్లు పాట పాడుతుండగా రాజ్ నాథ్ సింగ్ తన స్వరాన్ని జత కలిపారు. వారితో ఉల్లాసంగా గడిపారు.

ఇవి కూడా చదవండి

ఈ గర్వించదగిన సైనికుల ధైర్యం, అప్రమత్తత, పరాక్రమం కారణంగా మన దేశం సురక్షితంగా ఉంది” అని ఆయన ట్వీట్ చేశారు.

రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన ప్రకారం..  లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) వెంబడి మౌలిక సదుపాయాల అభివృద్ధి, అలాగే సామర్థ్య అభివృద్ధి, కార్యాచరణ సంసిద్ధత గురించి జనరల్ ఆఫీసర్ కమాండింగ్, 3 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ RC తివారీ ,ఇతర సీనియర్ అధికారులు రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు.

ఫ్రంట్‌లైన్‌లో మోహరించిన దళాల కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి అత్యాధునిక సైనిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఉపాధి గురించి కూడా ఆయనకు వివరించారు. రాజ్ నాథ్ సింగ్ తన మూడు రోజుల పర్యటనలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా  సమీక్షించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..