AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయోధ్యలో భక్తుల నుదుట బొట్టు పెట్టి గోలు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా.. రెండు కోట్ల వీక్షించిన వీడియో పై ఓ లుక్ వేయండి.

అమిత్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బాలుడి వీడియోను షేర్ చేశాడు. 'అయోధ్యలో నివసిస్తున్న గోలు భారతదేశంలోని చాలా మంది నిపుణుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. అంతకుమించి  ఆ బాలుడి ఆత్మవిశ్వాసం ..ఆర్జించే విధానం చూడదగినదని పేర్కొన్నాడు. రామమందిరాన్ని సందర్శించేందుకు అయోధ్య చేరుకున్న అమిత్ కు భక్తులకు నుదుటన గంధం తిలకంతో బొట్టు పెడుతున్న గోలు కనిపించాడు. అప్పుడు గోలు దగ్గరకు వెళ్లి అమిత్ రోజువారీ సంపాదన తెలుసుకునే ప్రయత్నం చేశాడు. చిన్నారి చెప్పిన సమాధానం విని బిత్తరపోయాడు.

అయోధ్యలో భక్తుల నుదుట బొట్టు పెట్టి గోలు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా.. రెండు కోట్ల వీక్షించిన వీడియో పై ఓ లుక్ వేయండి.
Golu Video Viral
Surya Kala
|

Updated on: May 07, 2024 | 12:58 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఇక్కడ ఎవరైనా పాపులర్ కావడం పెద్ద విషయం కాదు. మీలో ఏదైనా కళ లేదా ఏదైనా వింత చేసే గుణం ఉంచే చాలు. అవి ప్రజలను ఆకట్టుకుంటే పాపులర్ అయిపోతారు.   ఇంటర్నెట్ లో షేర్ చేస్తూ సందడి చేస్తారు. అంతేకాదు ఆ వీడియోలు మిమ్మల్ని రాత్రికి రాత్రే హీరోలను చేస్తాయి కూడా. ఢిల్లీలో వైరల్ అయిన వడా పావ్ అమ్మాయి నుంచి నాగ్‌పూర్‌కి చెందిన డాలీ చాయ్‌వాలా వరకు.. అనేక సోషల్ మీడియా పాపులర్ స్టార్ల వీడియోలను ఇంటర్నెట్‌లో చూడవచ్చు. ప్రస్తుతం అలంటి వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది అయోధ్యకు చెందిన గోలుకి చెందినది. ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు గోలు తన సమాధానంతో ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు.

క్రిప్టో అధ్యాపకుడు అమిత్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బాలుడి వీడియోను షేర్ చేశాడు. ‘అయోధ్యలో నివసిస్తున్న గోలు భారతదేశంలోని చాలా మంది నిపుణుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. అంతకుమించి  ఆ బాలుడి ఆత్మవిశ్వాసం ..ఆర్జించే విధానం చూడదగినదని పేర్కొన్నాడు. రామమందిరాన్ని సందర్శించేందుకు అయోధ్య చేరుకున్న అమిత్ కు భక్తులకు నుదుటన గంధం తిలకంతో బొట్టు పెడుతున్న గోలు కనిపించాడు. అప్పుడు గోలు దగ్గరకు వెళ్లి అమిత్ రోజువారీ సంపాదన తెలుసుకునే ప్రయత్నం చేశాడు. చిన్నారి చెప్పిన సమాధానం విని బిత్తరపోయాడు.

ఇవి కూడా చదవండి

రోజుకు రూ.1500 సంపాదిస్తున్న గోలు

ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నుదుట బొట్టు పెడతానని చిన్నారి చెబుతున్నాడు. ఆ తర్వాత రాత్రి 8 గంటల వరకు చందనం తిలకంగా పెట్టె పనిలో బిజిబిజిలా ఉంటానని చెప్పాడు. ఇలా రోజుకు సుమారు  రూ.1500 సంపాదిస్తున్నట్లు చిన్నారి చెప్పాడు. ఇది విన్న అమిత్ ఆశ్చర్యపోయాడు. అప్పుడు గోలు జీతం డాక్టర్‌తో సంపాదనతో సమానం అని చెప్పాడు. అప్పుడు చిన్నారి చెప్పే సమాధానం చాలా పవర్ ఫుల్ గా ఉంది.

ఇక్కడ వీడియో చూడండి

అమిత్ తన పోస్ట్‌లో ఇంకా ఇలా వ్రాశాడు. ‘గోలుకి తెలివితేటలు ఉన్నాయి. పెద్ద కంపెనీలు ఐఐఎమ్‌కి వెళ్లే నైపుణ్యం కూడా ఉంది. వాస్తవానికి దేశంలో నైపుణ్యం కలిగిన వ్యక్తులు లెక్కలేనంతమంది  ‘గోలు’ రూపంలో భారతదేశ వీధుల్లో తిరుగుతున్నారు. వీరికి ధైర్యం, విశ్వాసం కూడా ఉంటుంది. సరైన విద్య, మార్గదర్శకత్వం లభిస్తే గోలు వంటి వారు చేయని పని అంటూ ఉండదు అని ఆయన అన్నారు.

ఇన్‌స్టా హ్యాండిల్ @guardians_of_the_cryptoverseతో ఏప్రిల్ 29న షేర్ చేసిన ఈ వీడియో ఇంటర్నెట్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ వీడియోకి ఇప్పటివరకు రెండు కోట్లకు పైగా వీక్షణలు వచ్చాయి. వేల మంది వినియోగదారులు కామెంట్ చేశారు. కష్టపడి పనిచేసే గోలుకు సెల్యూట్ అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. అయితే ఇక నుంచి ఆలయాల వద్ద, ఘాట్లపై తిలకం పెట్టె పని కూడా ప్రారంభించాలని చాలా మంది వినియోగదారులు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us