రాత్రంతా ఫోన్ వదలని భార్య.. విడాకులు ఇప్పించమని పోలీస్ స్టేషన్ గడప తొక్కిన భర్త

తన భార్య ప్రవర్తనతో విసిగిపోయానని.. భార్య నుంచి తాను విడిపోవాలనుకుంటున్నానని.. ఆ భర్త పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. ఎలాగైనా తన భార్యను వదిలించుకోవాలనుకుంటున్నట్లు ఆ భర్త పోలీస్ స్టేషన్‌లో విజ్ఞప్తి చేశాడు. తాను  సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతోంది. సమయానికి తిండి కూడా పెట్టని భార్యతో బతకడం ఇష్టం లేదని చెప్పాడు. యువకుడి మాటలు విన్న పోలీసులు కేసు నమోదు చేసి భార్యాభర్తలిద్దరినీ పిలిచి మాట్లాడి..  శాంతింపజేసి ఇంటికి పంపించారు.

రాత్రంతా ఫోన్ వదలని భార్య.. విడాకులు ఇప్పించమని పోలీస్ స్టేషన్ గడప తొక్కిన భర్త
Uttar Pradesh News
Follow us

|

Updated on: May 07, 2024 | 12:04 PM

గత కొన్ని ఏళ్ల క్రితం వరకూ ఇంట్లో ఏ గొడవలు జరిగినా పక్కింటి వారికీ కూడా తెలియకూడదు.. గౌరవానికి భంగం అనుకునేవారు. ముఖ్యంగా ఆలుమగల మధ్య వచ్చే గొడవలు గొడదాటకూడదని భావించేవారు. కాలంతో పాటు వచ్చిన అన్ని మార్పుల్లో భాగంగా భార్యాభర్తల బంధంలో కూడా మార్పులు వచ్చాయి. చిన్న చిన్న విషయాలకే తగాదా పడుతున్నారు. లేదా పోలీసు స్టేషన్ గడప ఎక్కుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మథురలో పోలీస్ స్టేషన్‌లోని పోలీసు అధికారులు ఓ భర్త చేసిన విన్నపం విని ఆశ్చర్యపోయారు. భార్యపై ఫిర్యాదు చేసేందుకు భర్త పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. తన భార్య అర్థరాత్రి వరకు మొబైల్ ఫోన్ ఉపయోగిస్తుందని.. దీంతో ఆమె తెల్లవారుజాము వరకు నిద్రపోతుందని భర్త చెప్పాడు. భార్య ఆలస్యంగా నిద్రపోయి.. త్వరగా నిద్ర లేవడం లేదు.. తన భార్య నిద్ర లేచే సమయానికి తన ఆఫీసుకు వెళ్లే టైం అవుతోంది. దీంతో తాను ఆఫీసుకు ఆకలితో వెళ్లాల్సి వస్తోందంటూ పరిష్కారం చూపండి మహా ప్రభో అంటూ పోలీసుల ముందు తన ఆవేదన వెళ్లబోసుకున్నారు. అంతేకాదు ఇక తన భార్య ప్రవర్తనతో విసిగిపోయానని.. భార్య నుంచి తాను విడిపోవాలనుకుంటున్నానని.. ఆ భర్త పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు

ఎలాగైనా తన భార్యను వదిలించుకోవాలనుకుంటున్నట్లు ఆ భర్త పోలీస్ స్టేషన్‌లో విజ్ఞప్తి చేశాడు. తాను  సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతోంది. సమయానికి తిండి కూడా పెట్టని భార్యతో బతకడం ఇష్టం లేదని చెప్పాడు. యువకుడి మాటలు విన్న పోలీసులు కేసు నమోదు చేసి భార్యాభర్తలిద్దరినీ పిలిచి మాట్లాడి..  శాంతింపజేసి ఇంటికి పంపించారు.

పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలపై భార్యాభర్తలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకునే ఉదంతాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో కౌన్సిలింగ్  ద్వారా సెటిల్ మెంట్ చేసుకుంటే.. మరి కొన్ని సందర్భాల్లో కేసులు నమోదు చేయాల్సి వస్తోంది.

ఇవి కూడా చదవండి

ఒక్కోసారి భార్య గొడవ పెడుతుందని.. అందుకనే తన తల్లిదండ్రుల ఇంటి నుంచి వెళ్లిపోయారంటూ భర్త పోలీసు స్టేషన్ కు చేరుకుంటే, ఒక్కోసారి భార్యాభర్తలు బిజీ కావడం వల్ల చిన్న చిన్న విషయాలపై ప్రతిరోజు పోలీసులను ఆశ్రయిస్తున్నారని, కొన్ని సందర్భాల్లో పరిష్కారమవుతాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
వణుకుపుట్టించే హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
వణుకుపుట్టించే హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
వచ్చే ఏడాది ఫ్రాంచైజీలకు షాక్ ఇవ్వనున్న ముగ్గురు భారత ప్లేయర్స్
వచ్చే ఏడాది ఫ్రాంచైజీలకు షాక్ ఇవ్వనున్న ముగ్గురు భారత ప్లేయర్స్
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
18 ఏళ్ల గోదావరి.. సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
18 ఏళ్ల గోదావరి.. సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు.. లేటెస్ట్‌ వెదర్‌ రిపోర్ట్‌
ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు.. లేటెస్ట్‌ వెదర్‌ రిపోర్ట్‌
లీకైన కొత్త ఐఫోన్ ఫొటోలు.. స్టన్నింగ్ లుక్ అంటున్న నెటిజనులు..
లీకైన కొత్త ఐఫోన్ ఫొటోలు.. స్టన్నింగ్ లుక్ అంటున్న నెటిజనులు..
ఇంట్లో ఈ పరిస్థితులు ఉంటే.. నెగిటివ్‌ ఎనర్జీ ఉన్నట్లే..
ఇంట్లో ఈ పరిస్థితులు ఉంటే.. నెగిటివ్‌ ఎనర్జీ ఉన్నట్లే..
డయాబెటిస్‌తో బాధపడుతున్నా నో ప్రాబ్లమ్‌.. ఈ డైట్‌ ఫాలో అయితే చాలు
డయాబెటిస్‌తో బాధపడుతున్నా నో ప్రాబ్లమ్‌.. ఈ డైట్‌ ఫాలో అయితే చాలు
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా