ఆస్తమాకు చికిత్స లేదు.. నియంత్రణే ముఖ్యం.. ఏ ఆహారాన్ని తినాలి.. వేటికి దూరంగా ఉండాలంటే..
ప్రపంచవ్యాప్తంగా శ్వాసకోశ సమస్య, ఆస్తమా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ వ్యాధితో బాధపడే రోజుల సంఖ్య భారతదేశంలో కూడా తక్కువేం కాదు. ఆస్తమాతో బాధపడుతున్న వ్యక్తి నిరంతరం వచ్చే దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీని లక్షణాలు సకాలంలో గుర్తించకపోయినా.. సాధారణ దగ్గుగా పరిగణించి నిర్లక్ష్యం చేసినా పరిస్థితి తీవ్రంగా మారుతుంది. ఈ ఊపిరితిత్తుల వ్యాధికి ఖచ్చితమైన చికిత్స లేదు.. కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మాత్రమే దీనిని నియంత్రించాల్సి ఉంటుంది.