అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించాలనుకుంటున్నారా.. ఇంట్లో ఈ వస్తువులను తొలగించండి..

హిందూ మతంలో ఏదైనా పండుగ , శుభకార్యాలకు ముందే ఇంటిని శుభ్రం చేసుకుంటారు. ఈ సమయంలో  ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేసే వస్తువులను ఇంట్లో నుంచి తీసి బయటపడేస్తారు. అటువంటి పరిస్థితిలో, అక్షయ తృతీయకు ముందు వాస్తు దోషాలను కలిగించే కొన్ని వస్తువులను తొలగించాలి. అప్పుడే ఈ తేదీలో ఏర్పడిన యోగాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించాలనుకుంటున్నారా.. ఇంట్లో ఈ వస్తువులను తొలగించండి..
Akshaya Tritiya 2024
Follow us

|

Updated on: May 07, 2024 | 11:36 AM

అక్షయ తృతీయ పండుగను జరుపుకోవడానికి సిద్ధమవుతున్నట్లయితే.. తప్పనిసరిగా కొన్ని నియమాలను తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు చేసే పూజలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదంటే ఈ నియమాలను పాటించడం తప్పనిసరి. అందువల్ల అక్షయ తృతీయ పండుగకు ముందు ఇంటిని శుభ్రం చేస్తూ.. ఇంట్లో  ఉన్న కొన్ని వస్తువులను తీసివేయాలి. ఇంట్లో ఈ వస్తువులు ఉంటే మీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.  అనేక ఇబ్బందులకు గురవుతారు.

హిందూ మతంలో ఏదైనా పండుగ , శుభకార్యాలకు ముందే ఇంటిని శుభ్రం చేసుకుంటారు. ఈ సమయంలో  ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేసే వస్తువులను ఇంట్లో నుంచి తీసి బయటపడేస్తారు. అటువంటి పరిస్థితిలో, అక్షయ తృతీయకు ముందు వాస్తు దోషాలను కలిగించే కొన్ని వస్తువులను తొలగించాలి. అప్పుడే ఈ తేదీలో ఏర్పడిన యోగాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

ఈ ఏడాది మే 10వ తేదీన అక్షయ తృతీయ జరుపుకోనున్నారు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం ఉంది. అటువంటి పరిస్థితిలో లక్ష్మీ దేవి ఉండే ప్రాంతం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే లక్ష్మీదేవి పరిశుభ్రమైన ప్రదేశంలో మాత్రమే నివసిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇంటి నుంచి ఈ వస్తువులను తొలగించండి

  1. హిందూ మతంలో చీపురు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కొన్ని పండుగల్లో చీపురిని పూజిస్తారు. ఇంట్లో చీపురు ఉండటం వల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. కనుక అరిగిపోయిన, విరిగిన చీపురును ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. దీని వల్ల జీవితంలో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
  2. ఎండిన మొక్కలను ఉంచవద్దు: ఇంట్లో మొక్కలను పెంచుకోవడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే మొక్కలు ఎండిపోతే వాటిని ఇంటి నుంచి తొలగించండి. అటువంటి పరిస్థితిలో ఇంట్లో ఎండిన మొక్కలను ఉంచవద్దు. వాస్తవానికి ఇంట్లో ఎండిన మొక్కలను ఉంచడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడతాయి. డబ్బు కొరతను ఎదుర్కోవలసి ఉంటుంది.
  3. పాత , చిరిగిన చెప్పులు: ఎవరూ చిరిగిన బూట్లు, లేదా చెప్పులను ధరించకూడదు లేదా ఇంట్లో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల డబ్బుకు కొరత ఏర్పడుతుంది. అక్షయ తృతీయకు ముందు, ఇంటిలో ఉన్న పాత, చిరిగిన బూట్లు, చెప్పులు తొలగించండి.
  4. మురికి బట్టలు: అక్షయ తృతీయకు ముందే ఇంట్లో ఉన్న మురికి, చిరిగిన బట్టలు తొలగించండి. మురికి బట్టలు ధరించిన వారి జీవితంలో దురదృష్టం వెంటాడుతుందని నమ్ముతారు. అందుచేత మురికి బట్టలను ఇంటిలో నుంచి బయట పెట్టేయండి.
  5. పగిలిన గడియారం: జీవితంలో ఎప్పుడూ పగిలిన వాచ్ ను ధరించకూడదు. అలాగే ఇంట్లో గడియారం పని చేయక పొతే ఉంచవద్దు. వీటిని ఉంచుకోవడం జీవితంలో దురదృష్టాన్ని తెస్తుంది. అక్షయ తృతీయలోపు ఇంటి నుంచి వీటిని తీసివేయండి. ఎందుకంటే మనుషులకు సమయం చాలా విలువైనది. అందువల్ల,  ఇంట్లో సరైన గడియారాన్ని ఉపయోగించండి. ఇది మీ సమయాన్ని బాగా ఉంచుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Latest Articles
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!