AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవి నుంచి ఉపశమనం కోసం ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? అయితే ఇది మీరు తప్పక తెలుసుకోవాల్సిందే..

తమిళనాడులోని ప్రసిద్ధి నగరాలు ఊటీ, కొడైకెనాల్‌. వేసవి వచ్చిదంటే చాలు ఈ ప్రాంతాలకు వెళ్లి సేదదీరేందుకు ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తారు. అయితే ఇప్పుడు ఊటీ, కొడైకెనాల్ వెళ్లాలనుకునే వారు కొన్ని నియమాలను పాటించాల్సిందే.. పర్యాటకులకు ఈ-పాస్‌ను తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్‌, ఈ-పాస్‌లు నేటి నుంచి ఉపయోగించాల్సిందే.. ఎందుకంటే వేసవిలో ఈ ప్రాంతాల్లో ఉండే రద్దీని క్రమబద్దీకరించేందుకు ఈ పద్దతిని అమలు చేయనున్నట్లు తమిళనాడు సర్కార్ వెల్లడించింది. 

వేసవి నుంచి ఉపశమనం కోసం ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? అయితే ఇది మీరు తప్పక తెలుసుకోవాల్సిందే..
Tn E Pass Registration
Surya Kala
|

Updated on: May 07, 2024 | 9:51 AM

Share

వేసవి వచ్చిందంటే చాలు చల్లదనం కావాలని కోరుకుంటాం.. ఇక వేసవి సెలవుల్లో రకరకాల ట్రిప్స్ ప్లాన్ చేస్తారు. ముఖ్యంగా ప్రకృతి ఒడిలో సేద దీరేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. అలా మన దేశంలో ప్రసిద్ధి చెందిన వేసవి విడిది కేంద్రాలకు లోటు లేదు.. అయితే దక్షిణాది వారు ఎక్కువగా ఊటీ, కొడైకెనాల్ వెళ్లాలని ప్రణాళికలు వేసుకుంటారు. అయితే ఇప్పుడు ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలనుకునే పర్యాటకులు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరి.. వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడులోని ప్రసిద్ధి నగరాలు ఊటీ, కొడైకెనాల్‌. వేసవి వచ్చిదంటే చాలు ఈ ప్రాంతాలకు వెళ్లి సేదదీరేందుకు ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తారు. అయితే ఇప్పుడు ఊటీ, కొడైకెనాల్ వెళ్లాలనుకునే వారు కొన్ని నియమాలను పాటించాల్సిందే.. పర్యాటకులకు ఈ-పాస్‌ను తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్‌, ఈ-పాస్‌లు నేటి నుంచి ఉపయోగించాల్సిందే.. ఎందుకంటే వేసవిలో ఈ ప్రాంతాల్లో ఉండే రద్దీని క్రమబద్దీకరించేందుకు ఈ పద్దతిని అమలు చేయనున్నట్లు తమిళనాడు సర్కార్ వెల్లడించింది.

మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్‌ వారు నేటి నుంచి (మే  7వ తేదీ)  ఈ-పాస్‌ తప్పనిసరిగా తీసుకుని వెళ్లాల్సి ఉంది. ఇదే విషయాన్నీ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఊటీ, కొడైకెనాల్ వెళ్లే పర్యాటకులు తమ వివరాలను, ప్రయాణించే వాహన నెంబర్, ఎన్ని రోజులు బస చేస్తారు. ఎక్కడ ఏ హోటల్ లో బస చేస్తారు వంటి వివరాలను ఇక నుంచి ఆన్ లైన్ ద్వారా తెలియజేస్తూ ఈ పాస్ లు తీసుకోవాల్సి ఉంటుంది.

సోమవారం నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఊటీ, కొడైకెనాల్‌ వెళ్లాలనుకునే  పర్యాటకులు, వ్యాపారులు తమ పూర్తి వివరాలను epass.tnega.org వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని ఈ పాస్ ను పొందాల్సి ఉంటుంది. అయితే ఈ పాస్ విధానం ఒక్క వేసవి కాలం పూర్తి అయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ మాత్రమే ఉంటుందని.. ఇలా చేయడం వలన వాహన రద్దీని క్రమబద్దీకరించవచ్చు అని స్పష్టం చేసింది స్టాలిన్ సర్కార్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..