AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish Rain: ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం.. క్షిపణులకు బదులుగా చేపల ప్రయోగం అంటూ ఫన్నీ కామెంట్స్

ఇరాన్‌లో ఆకాశం నుంచి ఒక్కసారిగా వర్షం కురుస్తున్న చేపలను చూసి స్థానికులు చలించిపోయారు. ఈ ప్రత్యేకమైన వర్షం వీడియో కూడా వైరల్ అయ్యింది. ఇందులో ఆకాశం నుండి చేపల వర్షం కురుస్తుంది.  ప్రజలు వాటిని పోటీపడుతూ ఏరుకున్నారు కూడా.. ఇప్పుడు ఇది ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న తలెత్తుతోందా.. ఈ సంఘటన శక్తివంతమైన తుఫాను వల్ల సంభవించిందని నివేదించబడింది.

Fish Rain: ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం.. క్షిపణులకు బదులుగా చేపల ప్రయోగం అంటూ ఫన్నీ కామెంట్స్
Fish Rain In IranImage Credit source: X/@UKR_token
Surya Kala
|

Updated on: May 07, 2024 | 8:35 AM

Share

ఉక్కబోత నుంచి ఉపశమనాన్ని ఇస్తూ వర్షం కురిస్తేనే చాలా సంతోషముగా ఉంటుందని. మరి అలాంటిది వర్షం చినుకులతో పాటు చేపలు కూడా ఆకాశం నుంచి జలజలా  పడుతుంటే అప్పుడు ఆ ఫీలింగ్ వర్ణనాతీతం. అప్పుడప్పుడు అక్కడక్కడ చేపల వర్షం కురిసిన సంఘటనల గురించి వార్తలు వింటూనే ఉన్నాం.. ఇరాన్ దేశంలో చేపల వాన కురిసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇరాన్‌లో ఆకాశం నుంచి ఒక్కసారిగా వర్షం కురుస్తున్న చేపలను చూసి స్థానికులు చలించిపోయారు. ఈ ప్రత్యేకమైన వర్షం వీడియో కూడా వైరల్ అయ్యింది. ఇందులో ఆకాశం నుండి చేపల వర్షం కురుస్తుంది.  ప్రజలు వాటిని పోటీపడుతూ ఏరుకున్నారు కూడా..

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఇది ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న తలెత్తుతోందా.. ఈ సంఘటన శక్తివంతమైన తుఫాను వల్ల సంభవించిందని నివేదించబడింది. ఇది మొదట జలచరాలను సముద్రం నుంచి ఆకాశం వైపుకు లాగి.. అనంతరం వర్షం కురిసే సమయంలో ఆ చేపలను నేలపైకి విసిరింది. దీంతో నిజంగానే చేపల వర్షం కురుస్తోందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇరాన్‌లోని యసుజ్ ప్రాంతంలో ఈ అరుదైన ఘటన జరిగినట్లు సమాచారం. రోడ్డుపై వాహనాలు వెళ్తుండగా ఆకాశం నుంచి చేపల వర్షం కురుస్తున్నట్లు వీడియోలో చూపించారు. చేపలు సజీవంగా ఉన్నాయి. రోడ్డుమీద పడిన తర్వాత చేపలు తమ మనుగడ కోసం పోరాడాయి. ఎగిరెగిరి పడ్డాయి.

@UKR_token హ్యాండిల్‌తో వీడియోను షేర్ చేస్తూ ఆ వినియోగదారు ఇరాన్‌లో తుఫాను తర్వాత అసాధారణమైన సంఘటన జరిగిందని.. ఆకాశం నుండి చేపలు వర్షం పడటం ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు లక్ష మంది ఈ వీడియోను వీక్షించగా, చాలా మంది వినియోగదారులు ఆశ్చర్యానికి గురై తమ స్పందనలను రకరకాలుగా ఇస్తున్నారు.

అకస్మాత్తుగా…ఇరాన్‌లో చేపల వర్షం కురిసింది

ఒక వినియోగదారు చెప్పారు ఇది అరుదైన ఘటన ఏమీ కాదు.. సముద్రం లేదా సరస్సుల మీదుగా  వచ్చే సుడిగాలి.. ఇలా నీటిలోని చేపలను లాగి గాలిలోకి విసిరివేస్తుంది. ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది. అదే సమయంలో ఇజ్రాయెల్ క్షిపణులకు బదులుగా చేపలను ప్రయోగించినట్లు అనిపిస్తోందని మరొకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..