AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: క్రికెట్ ఆడుతుండగా అక్కడ తగిలిన బాల్.. స్పాట్‌లోనే

వేసవి సెలవుల్లో మీ పిల్లలు క్రికెట్ ఆడేందుకు వెళ్తున్నారా..? అది గల్లీ క్రికెట్ అయినా సరే.. వారు జాగ్రత్తలు తీసుకునేలా చూడాల్సిన బాధ్యత మీదే. లేదంటే పెను ప్రమాదాలు సంభవించవచ్చు. తాజాగా పూణెలో క్రికెట్‌ ఆడుతుండగా బంతి మర్మావయవాలకు తగలడంతో 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

Viral Video: క్రికెట్ ఆడుతుండగా అక్కడ తగిలిన బాల్.. స్పాట్‌లోనే
Playing Cricket
Ram Naramaneni
|

Updated on: May 07, 2024 | 8:34 AM

Share

గత నెల వరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలు ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. సాయంత్రం వేళల్లో ఎండ కాస్త తగ్గగానే.. పిల్లలు చాలామంది ఆటలు ఆడుకునేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అందులో క్రికెట్ మొదటి వరసలో ఉంటుంది. అయితే క్రికెట్ ఆడెటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తుంచుకోండి. ఈ విషయం తల్లిదండ్రులు పిల్లలకు పదే, పదే చెబుతూ ఉండాలి. తాజాగా పూణెలో ఓ విషాద ఘటన జరిగింది.  క్రికెట్ ఆడుతుండగా.. బంతి మర్మావయవాలకు బలంగా తగలడంతో 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. లోహెగావ్‌లోని జగత్‌గురు స్పోర్ట్స్ అకాడమీ గ్రౌండ్‌లో మే 2వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  లోహెగావ్‌ ప్రాంతానికి చెందిన  శంభు కాళిదాస్‌ ఖాండ్వే అలియాస్‌ శౌర్య తన ఫ్రెండ్స్‌తో కలిసి క్రికెట్‌ ఆడటానికి వెళ్లాడు. ఈ క్రమంలో బౌలింగ్ చేస్తుండగా.. బ్యాటర్ కొట్టిన బంతి  వేగంగా వచ్చి శౌర్య మర్మావయవాలను బలంగా తాకడంతో అక్కడే కుప్పుకూలిపోయి.. అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ ఊహించని పరిణామంతో భయాందోళనకు గురైన తోటి పిల్లలు బాలుడిని మామూలు స్థితికి తీసుకురావడానికి ట్రై చేశారు. చుట్టుపక్కలవారు అతణ్ని సమీపంలోని  హాస్పిటల్‌కు తరలించగా, చికిత్స పొందుతూ బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.

సాధారణంగా క్రికెట్‌ ఆడేటప్పుడు హెల్మెట్, గార్డు తప్పనిసరిగా వినియోగించాలి. ఎందుకంటే..  బంతి బలంగా తలకు కానీ, ఇతర సున్నిత అవయవాలకు తగిలితే.. ప్రాణాలమే ముప్పు ఉంటుంది. ప్రస్తుతం శౌర్య విషయంలో అదే జరిగింది. అందుకే మీ పిల్లల విషయంలో బీ అలెర్ట్.

వీడియోలో దృశ్యాలు మీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు…..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి