AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కింగ్ కోబ్రాకి రుద్రాభిషేకం చేస్తున్న ఫ్యామిలీ.. కాటు వేయబోయినా వెనక్కి తగ్గితే ఒట్టు..!

ఈ వీడియోలో ఒక పాముని పల్లెంలో పెట్టి ఇంట్లోనే పూజలు చేస్తూ కనిపించారు. ఇందులో విశేషమేమిటంటే  అసలు సిసలైన.. పాము అంటే బతికి ఉన్న పాము ప్లేట్‌లో చుట్ట చుట్టుకుని కూర్చొని ఉంది. ఈ పళ్లెం చుట్టూ దంపతులతో పాటు అనేక మంది భక్తులు కూర్చుకుని ఉన్నారు. దానిని పూజిస్తున్నారు. ఈ సమయంలో తనను పూజిస్తున్న వ్యక్తి వైపు పడగ విప్పడం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ క్లిప్‌ని చూసిన జనాలు 'ఎవరైనా అతని గట్స్ కు సెల్యూట్ చెయ్యండి బ్రదర్' అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

కింగ్ కోబ్రాకి రుద్రాభిషేకం చేస్తున్న ఫ్యామిలీ.. కాటు వేయబోయినా వెనక్కి తగ్గితే ఒట్టు..!
Snake Worship
Surya Kala
|

Updated on: May 07, 2024 | 8:59 AM

Share

సోషల్ మీడియాలో ఒక వీడియో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూస్తే ప్రజలది మూర్ఖత్వం అనాలో అమాయకత్వం అనాలతో అర్ధం కావడం లేదంటూ ప్రజలు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ వీడియోలో ఒక పాముని పల్లెంలో పెట్టి ఇంట్లోనే పూజలు చేస్తూ కనిపించారు. ఇందులో విశేషమేమిటంటే  అసలు సిసలైన.. పాము అంటే బతికి ఉన్న పాము ప్లేట్‌లో చుట్ట చుట్టుకుని కూర్చొని ఉంది. ఈ పళ్లెం చుట్టూ దంపతులతో పాటు అనేక మంది భక్తులు కూర్చుకుని ఉన్నారు. దానిని పూజిస్తున్నారు. ఈ సమయంలో తనను పూజిస్తున్న వ్యక్తి వైపు పడగ విప్పడం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ క్లిప్‌ని చూసిన జనాలు ‘ఎవరైనా అతని గట్స్ కు సెల్యూట్ చెయ్యండి బ్రదర్’ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఓ పండితుడి రుద్రాభిషేకం చేస్తున్నట్టు వీడియోలో చూడవచ్చు. దంపతులు కూర్చుని ప్రార్థనలు చేస్తున్నారు. అయితే నిజమైన కింగ్ కోబ్రా ప్లేట్‌లో పడగ విప్పి చుట్టచుట్టుకుని కూర్చుని ఉంది. ఇది చూసిన  సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోయారు. పూజ సమయంలో వ్యక్తిపై పాము దాడి చేయడాన్ని వీడియోలో చూడవచ్చు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ తర్వాత కూడా ఈ జంట పూజలు కొనసాగించారు. ఆ సమయంలో నాగుపాము బుసలు కొడుతూనే ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ ఆశ్చర్యకరమైన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో omkar_sanatanii అనే ఖాతాలో భాగస్వామ్యం చేయబడింది. నాగ దేవత , మహాదేవుడి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని వినియోగదారు ఈ వీడియోకి శీర్షికలో జత చేశారు. ఈ వీడియో పోస్ట్‌పై జనాలు రకరకాల కామెంట్ చేస్తున్నారు.

అసలు పామును ఆ దంపతులు పూజించిన వీడియో ఇక్కడ చూడండి

ఒక వినియోగదారు ఇలా వ్రాశారు, అటువంటి పూజ చేసే వారికి 21-గన్ సెల్యూట్ ఇవ్వాలి. అయితే, ఇప్పుడు దుర్గాపూజలో సింహాన్ని తీసుకురండి అని మరొక వినియోగదారు చెప్పారు. ఇది కాటు వేస్తె తదుపరి పూజ మీదే అని మరో వినియోగదారు వ్యాఖ్యానించారు. ఇంకో యూజర్ ఇది చూసిన తర్వాత పోటీ చాలా టఫ్ గా మారిందని ఇతర పండితులు అనుకుంటూ ఉండాలని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..