Tour: మండె ఎండల్లో అందాల అరకు టూర్.. తక్కువ బడ్జెట్‌లోనే..
ఎండలు దంచికొడుతున్నాయి. పిల్లలకు సెలవులు వచ్చేశాయ్. మరి ఈ మండె ఎండల్లో చల్లటి ప్రకృతి రమణీయత ప్రదేశాలను సందర్శిస్తే భలే ఉంటుంది కదూ! మీలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం మంచి టూరిజం ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ అయ్యే ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* టూర్ ప్యాకేజీలో భాగంగా తొలి రోజు హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ఐఆర్‌ఓ పర్యాటక్ భవన్ నుంచి, 6.30 గంటలకు సీఆర్‌ఓ బషీర్‌బాగ్ నుంచి బస్సు బయలుదేరుతుంది.
* రెండో రోజు ఉదయం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అనంతరం హోటల్‌లో చెకిన్ అయ్యి ఫ్రెషప్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కైలాసగిరి, సింహాచలం, రుషికొండ, సబ్‌మెరైన్ మ్యూజియం సందర్శన ఉంటుంది. రాత్రి బీచ్‌ను వీక్షించి హోటల్‌లో బస చేయాలి.
* ఇక మూడో రోజు ఉదయం 6 గంటలకు అరకకు ప్రయాణం ప్రారంభమవుతుంది. అక్కడ ట్రైబల్ మ్యూజియం, కాఫీ ప్లాంటేషన్, బొర్రా గుహల సందర్శన ఉంటుంది. రాత్రి బస అరుకులో హోటల్‌లో ఉంటుంది.
* నాల్గవ రోజు ఉదయం అరకు నుంచి బయలుదేరి అన్నవరం బయలుదేరి వెళ్తారు. అనంతరం అక్కడ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత హైదరాబాద్ తిరుగు ప్రయాణం మొదలవుంది. ఐదవ రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ చేరుకోవడం టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధర విషయానికొస్తే పెద్దలకు రూ. 6,999కాగా చిన్నారులకు రూ. 5,5999గా నిర్ణయించారు. ప్రతీ బుధవారం ఈ టూర్ ఆపరేట్ చేస్తారు. ప్యాకేజీలో భాగంగా ఏనాన్ ఏసీ ట్రాన్స్‌పోర్ట్, వైజాగ్‌లో ఏసీ అకామిడేషన్, అరకులో నాన్ ఏసీ హోటల్ కవర్ అవుతాయి. ఇక ఫుడ్, ఎంట్రీ టికెట్స్, దర్శన్ టికెట్స్, బోటింగ్ వంటివి ప్యాకేజీలో కవర్ కావు. పూర్తి వివరాల కోసం ఈ +91-1800-425-46464 నెంబర్‌ను సంప్రదించండి.
మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..