AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులను సమర్పించండి.. లక్ష్మీదేవి కోరిన కోర్కెలు తీరుస్తుంది..

అక్షయ తృతీయ రోజున శ్రీమహావిష్ణువును లక్ష్మీ సమేతంగా పూజిస్తే జీవితంలోని అన్ని రకాల సంక్షోభాలు తొలగిపోయి ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీ దేవికి శ్రీఫలం అంటే కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. అందుకే అక్షయ తృతీయ నాడు లక్ష్మీ దేవిని పూజించే ముందు కలశాన్ని ఏర్పాటు చేసి పూజిస్తారు, ఇలా చేయడం వలన లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుందని నమ్మకం. 

అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులను సమర్పించండి.. లక్ష్మీదేవి కోరిన కోర్కెలు తీరుస్తుంది..
Akshaya Tritiya Bhog
Surya Kala
|

Updated on: May 07, 2024 | 9:23 AM

Share

హిందూ మతంలో అక్షయ తృతీయ పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ తిథి నాడు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు, లక్ష్మి దేవి, సంపదలకు అధినాయకుడు అయిన కుబేరుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. అంతేకాదు ఈ దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక వంటకాలు తయారు చేసి వాటిని సమర్పిస్తారు. పూజ సమయంలో దేవునికి ఆహార పదార్ధాలను నైవేద్యంగా సమర్పించడం హిందూ సంప్రదాయం. ఎందుకంటే నైవేద్యం లేకుండా చేసే పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. కనుక అక్షయ తృతీయ రోజున ఈ ప్రత్యేక వస్తువులను సమర్పించండి.

అక్షయ తృతీయ రోజున శ్రీమహావిష్ణువును లక్ష్మీ సమేతంగా పూజిస్తే జీవితంలోని అన్ని రకాల సంక్షోభాలు తొలగిపోయి ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీ దేవికి శ్రీఫలం అంటే కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. అందుకే అక్షయ తృతీయ నాడు లక్ష్మీ దేవిని పూజించే ముందు కలశాన్ని ఏర్పాటు చేసి పూజిస్తారు, ఇలా చేయడం వలన లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుందని నమ్మకం.

అక్షయ తృతీయ శుభ సమయం

వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథి 10 మే 2024న ఉదయం 4:17 గంటలకు ప్రారంభమై 11 మే 2024న తెల్లవారుజామున 2:50 గంటలకు ముగుస్తుంది. అంతే కాకుండా మే 10వ తేదీ ఉదయం 5.33 గంటల నుంచి మధ్యాహ్నం 12.18 గంటల వరకు అక్షయ తృతీయ పూజలకు అనుకూల సమయం.

అక్షయ తృతీయ నాడు సమర్పించాల్సిన వస్తువులు

  1. అక్షయ తృతీయ రోజున పూజ సమయంలో లక్ష్మీ దేవికి తెలుపు రంగు దుస్తులను ధరించి పూజించండి. అంతేకాదు తెలుపు రంగు ఆహారాన్ని అందించండి.
  2. లక్ష్మి దేవికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టం. అటువంటి పరిస్థితిలో అక్షయ తృతీయ నాడు తామరపువ్వుని సమర్పించండి.
  3. అక్షయ తృతీయ సందర్భంగా మఖానా చేసిన వస్తువులను నైవేద్యంగా సమర్పించండి. ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది.
  4. తామర గింజలు పూజకు పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, అక్షయ తృతీయ నాడు సమర్పిస్తే లక్ష్మీదేవి తన భక్తుల కోరికలను తీరుస్తుంది.
  5. ఇది కాకుండా అక్షయ తృతీయ రోజున పూజ సమయంలో లక్ష్మీ దేవికి మఖానాతో చేసిన ఖీర్‌ను కూడా సమర్పించవచ్చు.
  6. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి తమలపాకు అంటే చాలా ఇష్టం. అక్షయ తృతీయ నాడు పూజ ముగిసిన తర్వాత, లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం.
  7. తన భక్తుల ఇంట సుఖ సంతోషాలను, సిరి సంపదలను అనుగ్రహిస్తుంది.
  8. అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులను సమర్పిస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నురాలై భక్తులు కోరిన  కోరికలన్నింటినీ తీరుస్తుంది.
  9. అంతేకాదు లక్ష్మిదేవితో పాటు విష్ణువు, కుబేరులు కూడా కోరుకున్న కొరిర్కెలు తీర్చేలా ఆశీర్వాదం ఇస్తాడు.    ఇంట్లో ఆనందం, సంతోషం ఉంటుంది. జీవితంలో ఒక్కోసారి ఏర్పడే కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు