తండ్రి ఆజ్ఞను అనుసరించి తల్లి తల నరికిన పరశురాముడు.. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే..
బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం పరశురాముడి తండ్రి తల్లిని చంపమని ఆజ్ఞాపించాడు. తన తండ్రి ఆజ్ఞను అనుసరించి తల్లిని తన పరశుతో నరికి చంపాడు. పరశురాముడు తన ఆజ్ఞలను పాటించడంతో జమదగ్ని మహర్షి చాలా సంతోషించి.. ఏమైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు పరశురాముడు తన తల్లిని బతికించమని అభ్యర్థించాడు.
వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ రోజున పరశురాముని జన్మదినోత్సవం జరుపుకుంటారు. ఈ సంవత్సరం పరశురామ జయంతిని దేశవ్యాప్తంగా శుక్రవారం, మే 10, 2024న జరుపుకుంటారు. పరశురామ జయంతి రోజున చేసే పుణ్య కార్యాల ప్రభావం జీవితాంతం తోడు ఉంటుందని నమ్మకం. ఎందుకంటే పరశురాముడిని విష్ణువు ఆరవ అవతారంగా మాత్రమే కాదు శివుని అంశంగా కూడా భావిస్తారు. పరశురాముడు జమదగ్ని మహర్షికి, రేణుక దేవికి జన్మించాడు. పరశురాముడు తల్లిదండ్రులకు నాల్గవ సంతానం. అంతేకాదు అతను న్యాయ అన్యాయ విచక్షణ కలిగిన దైవంగా కూడా పరిగణించబడుతున్నాడు. పరశురాముడు తన తండ్రి మాటలను అనుసరించి తన తల్లి తల నరికి చంపాడు.
తల్లి తలను ఎందుకు నరికివేయాల్సి వచ్చిందంటే
బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం పరశురాముడి తండ్రి తల్లిని చంపమని ఆజ్ఞాపించాడు. తన తండ్రి ఆజ్ఞను అనుసరించి తల్లిని తన పరశుతో నరికి చంపాడు. పరశురాముడు తన ఆజ్ఞలను పాటించడంతో జమదగ్ని మహర్షి చాలా సంతోషించి.. ఏమైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు పరశురాముడు తన తల్లిని బతికించమని అభ్యర్థించాడు.
అసలు ఎందుకు రేణుక దేవి తలను నరకాల్సి వచ్చిందంటే
పరశురాముడు తన తండ్రి నుంచి పొందిన వర బలంతో తన తల్లిని తిరిగి బ్రతికించాడు. అయితే జమదగ్ని మహర్షి ఎందుకు తన భార్య తలను నరకమని చెప్పాడంటే.. పురాణం ప్రకారం ఒక రోజు కొడుకులందరూ పని కోసం అడవికి వెళ్ళినప్పుడు.. తల్లి రేణుక నదిలో స్నానం చేసి ఆశ్రమానికి తిరిగి వస్తుండగా.. చిత్రరథ రాజు నీటిలో స్నానం చేయడం చూసింది. ఆమె మనస్సు చెలించింది. ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. మహర్షి జమదగ్ని ఆమె భావాలను చూసి ఈ విషయం తెలుసుకున్నాడు.
అదే సమయంలో పరశురాముడి అన్నలు రుక్మిన్, సుషేణుడు, వాసు, విశ్వావసుడు కూడా అక్కడికి చేరుకున్నారు. మహర్షి జమదగ్ని వారందరినీ ఒక్కొక్కరుగా పిలిచి వారి తల్లిని చంపమని ఆజ్ఞాపించాడు. అయితే వారందరూ అందుకు నిరాకరించారు. దీంతో కోపోద్రిక్తుడైన జమదగ్ని మహర్షి ఆలోచనా శక్తిని కోల్పోతారని తన కొడుకులను శపించాడు. అప్పుడు పరశురాముడు అక్కడికి వచ్చి తన తండ్రి ఆజ్ఞను అనుసరించి తల్లి తలను నరికివేశాడు.
మూడు వరాలను పొందిన పరశురాముడు
తన ఆజ్ఞలను అనుసరించిన పరశురాముడిని చూసి తండ్రి జమదగ్నికి చాలా సంతోషం కలిగింది. ఆ తర్వాత పరశురాముడుకి మూడు వరాలను ఇస్తానని కోరుకోమన్నాడు. అప్ప్పుడు మొదటి వరంగా తన తల్లిని మళ్లీ సజీవంగా చూడాలని కోరుకోవడం. రెండవది నలుగురు అన్నదమ్ములను శాపవిముక్తులను చేసి, వారికి ఆలోచించే శక్తిని ఇవ్వాలని కోరుకున్నాడు. మూడవ వరంలో తాను ఎన్నడూ ఓటమి పాలవ్వకూడదని.. చిరంజీవిగా జీవించాలనే వరాన్ని కోరుకున్నాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు