IRCTC Tour Package: వేసవిలో టూర్‌కు వెళ్దామనుకుంటున్నారా..? ఐఆర్‌సీటీసీ అందించే థాయ్‌లాండ్ ప్యాకేజీ గురించి తెలుసుకోవాల్సిందే

భారతదేశంలో మే నెలలో గరిష్ట ప్రయాణ ప్రణాళికలు చేస్తూ ఉంటారు. మీరు విదేశాలకు టూర్‌కు వెళ్దామనుకుంటే ఐఆర్‌సీటీసీ మీకో గుడ్ న్యూస్ అందిస్తుంది.  ఐఆర్‌సీటీసీ థాయ్‌లాండ్ కోసం ప్రత్యేక ఎయిర్ టూర్ ప్యాకేజీను ప్రకటించింది. అయితే ఐఆర్‌సీటీసీ అందించే నయా ప్యాకేజీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

IRCTC Tour Package: వేసవిలో టూర్‌కు వెళ్దామనుకుంటున్నారా..? ఐఆర్‌సీటీసీ అందించే థాయ్‌లాండ్ ప్యాకేజీ గురించి తెలుసుకోవాల్సిందే
Irctc Thailand Tour
Follow us

|

Updated on: May 07, 2024 | 12:20 PM

మే నెల ప్రారంభమైంది. విద్యార్థులందరికీ సెలవులు ఇచ్చేశారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా పెరిగిన ఎండల నేపథ్యంలో వీలైనంతగా సెలవులు తీసుకుని తమకు కావాల్సిన వారికితో టూర్స్‌కు చెక్కేస్తూ ఉంటారు. కొంత మంది దేశీయంగా టూర్స్‌కు వెళ్తే మరికొంత మంది తక్కువ ధరల్లో విదేశాలకు కూడా టూర్స్‌కు వెళ్తూ ఉంటారు. కాబట్టి భారతదేశంలో మే నెలలో గరిష్ట ప్రయాణ ప్రణాళికలు చేస్తూ ఉంటారు. మీరు విదేశాలకు టూర్‌కు వెళ్దామనుకుంటే ఐఆర్‌సీటీసీ మీకో గుడ్ న్యూస్ అందిస్తుంది.  ఐఆర్‌సీటీసీ థాయ్‌లాండ్ కోసం ప్రత్యేక ఎయిర్ టూర్ ప్యాకేజీను ప్రకటించింది. అయితే ఐఆర్‌సీటీసీ అందించే నయా ప్యాకేజీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఐఆర్‌సీటీసీ ఈ ప్రత్యేక ఎయిర్ టూర్ ప్యాకేజీ పేరు ట్రెజర్స్ ఆఫ్ థాయ్లాండ్ ఎక్స్ హైదరాబాద్ పేరుతో లాంచ్ చేసింది. ఐఆర్‌సీటీసీ ఈ ప్రత్యేక ఎయిర్ టూర్ ప్యాకేజీ 3 రాత్రులు, 4 రోజులుగా ఉంటుంది. ఈ ప్రత్యేక ప్యాకేజీ ఈ నెల 9న అంటే మే 9న హైదరాబాద్ నుంచి ప్రారంభం కానుంది. ప్యాకేజీలోని ట్రావెలింగ్ మోడ్ ఫ్లైట్, దీనిలో హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వరకు నోక్ ఎయిర్ ఫ్లైట్లో ప్రయాణం ఉంటుంది. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలో 4 అల్పాహారం, 4 భోజనం, 3 రాత్రి భోజనం ఉన్నాయి. ఈ ప్రత్యేక ఎయిర్ టూర్ ప్యాకేజీలో మీరు బ్యాంకాక్తో పాటు పట్టాయాను సందర్శించవచ్చు. అలాగే, ఈ మొత్తం ప్యాకేజీలో మీరు త్రీ స్టార్ హెూటల్లో బస చేయవచ్చు. 

ప్యాకేజీ అంతటా స్థానిక టూర్ గైడ్ మీతో పాటు వస్తారు. ఈ ప్రత్యేక ప్యాకేజీలో మొత్తం సీట్ల సంఖ్య 34. ఇది కాకుండా ఈ ప్యాకేజీలో 80 ఏళ్లలోపు వారికి ప్రయాణ బీమా కూడా లభిస్తుంది. ప్రత్యేక ఎయిర్ టూర్ ప్యాకేజీ ధర విషయానికి వస్తే సింగిల్ బుకింగ్ పై మీరు రూ. 57,415 ఖర్చు చేయాల్సి ఉంటుంది. డబుల్, ట్రిపుల్ షేరింగ్ ధర రూ.49,040గా ఉంది. ఇది కాకుండా పిల్లల కోసం బెడ్ కొనుగోలుకు రూ.47,145, చంటి పిల్లలకు బెడ్ కొనకుండా రూ.42,120 వెచ్చించాల్సి ఉంటుంది. మీరు కూడా ఈ ప్రత్యేక ఎయిర్ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!