Fruits for Cholesterol: వేసవిలో ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే పండ్లు.. మర్చిపోకుండా తినాలంటున్న నిపుణులు

అధిక కొలెస్ట్రాల్ 'సైలెంట్‌ కిల్లర్' వంటిది. ఇది మెల్లగా ప్రాణాన్ని హరిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే మందులు తప్పక తీసుకోవాలి. అలాగే అధిక కొవ్వు, అధిక కేలరీల ఆహారాలు అస్సలు తీసుకోకూడదు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. అందుకే కొలెస్ట్రాల్ రోగుల ఆహారంలో ధాన్యాలు ఎక్కువగా చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. అయితే ఈ వేసవిలో ధాన్యాలు మాత్రమే తింటే సరిపోదు.. ఈ కింది వేసవి పండ్లను కూడా మీ రోజువారీ ఆహారంలో..

Fruits for Cholesterol: వేసవిలో ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే పండ్లు.. మర్చిపోకుండా తినాలంటున్న నిపుణులు
Fruits at night
Follow us

|

Updated on: May 06, 2024 | 8:08 PM

అధిక కొలెస్ట్రాల్ ‘సైలెంట్‌ కిల్లర్’ వంటిది. ఇది మెల్లగా ప్రాణాన్ని హరిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే మందులు తప్పక తీసుకోవాలి. అలాగే అధిక కొవ్వు, అధిక కేలరీల ఆహారాలు అస్సలు తీసుకోకూడదు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. అందుకే కొలెస్ట్రాల్ రోగుల ఆహారంలో ధాన్యాలు ఎక్కువగా చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. అయితే ఈ వేసవిలో ధాన్యాలు మాత్రమే తింటే సరిపోదు.. ఈ కింది వేసవి పండ్లను కూడా మీ రోజువారీ ఆహారంలో చేర్చితే శరీరంలో కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.

మామిడిపండ్లు

వేసవిలో లభించే మామిడి పండ్లు తినడం ద్వారా కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. మామిడిలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలు, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. మామిడి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

పుచ్చకాయ

వేసవి పుచ్చకాయల సీజన్. తక్కువ క్యాలరీలు, నీరు ఎక్కువగా ఉండే ఈ పండు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. పుచ్చకాయలో లైకోపీన్ ఉంటుంది. ఇది అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ద్రాక్ష

వేసవిలో ద్రాక్షను ఎక్కువగా తినాలి. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. అంతేకాకుండా ద్రాక్షలో అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్లు ఉంటాయి.

జామ

ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న జామ LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, ఈ పండులో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది, ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

ఎండుద్రాక్ష

ఎండుద్రాక్షలో పాలీఫెనాల్స్ మరియు ప్యూనికాలాజిన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి, ఇవి ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఎండుద్రాక్ష గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఈ పండులో ఫైబర్, విటమిన్లు కూడా ఉంటాయి.

పండిన బొప్పాయి

పండిన బొప్పాయిలో పపైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది. అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. పండిన బొప్పాయిలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

యాపిల్స్

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో యాపిల్స్ ఉత్తమం. ఈ పండ్లలో కరిగే ఫైబర్ ‘పెక్టిన్’ ఉంటుంది. ఇది LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. యాపిల్స్‌లో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

అరటిపండు

ప్రతిరోజూ ఒక అరటిపండు తినడం వల్ల అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ నుంచి బయటపడవచ్చు. అరటిపండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథానల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
'అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి'.. జైల్ భరోకి కేజ్రీవాల్ పిలుపు..
'అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి'.. జైల్ భరోకి కేజ్రీవాల్ పిలుపు..
తొలి 7 మ్యాచ్‌ల్లో ఒకే విజయం.. 15 రోజుల్లో మారిన ఆర్‌సీబీ
తొలి 7 మ్యాచ్‌ల్లో ఒకే విజయం.. 15 రోజుల్లో మారిన ఆర్‌సీబీ
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..