AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET UG 2024 Exam: తమ్ముడిని డాక్టర్‌ని చేయాలనుకునీ.. చిక్కులు కొని తెచ్చుకున్న ఎంబీబీఎస్‌ స్టూడెంట్‌!

దేశ వ్యాప్తంగా నీట్‌ యూజీ 2024 ప్రవేశ పరీక్ష ఆదివారం (మే 5) జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం జరిగిన ఈ పరీక్షలో రాజస్థానలో ఓ విద్యార్ధికి బదులు మరొక విద్యార్ధి పరీక్షకు హాజరై పట్టుబడ్డాడు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ్ముడు నీట్ పరీక్ష రాయవల్సి ఉండగా అన్నయ్య హాజరయ్యాడు. అసలు అభ్యర్ధికి బదులు డూప్లికేట్ అభ్యర్థి పరీక్షకు హాజరైనట్లు పరీక్ష నిర్వహణ అధికారులు ఆరోపించారు. వెంటనే పోలీసులను పిలిపించగా..

NEET UG 2024 Exam: తమ్ముడిని డాక్టర్‌ని చేయాలనుకునీ.. చిక్కులు కొని తెచ్చుకున్న ఎంబీబీఎస్‌ స్టూడెంట్‌!
MBBS student appears as proxy candidate in NEET
Srilakshmi C
|

Updated on: May 06, 2024 | 3:31 PM

Share

జైపూర్, మే 6: దేశ వ్యాప్తంగా నీట్‌ యూజీ 2024 ప్రవేశ పరీక్ష ఆదివారం (మే 5) జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం జరిగిన ఈ పరీక్షలో రాజస్థానలో ఓ విద్యార్ధికి బదులు మరొక విద్యార్ధి పరీక్షకు హాజరై పట్టుబడ్డాడు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ్ముడు నీట్ పరీక్ష రాయవల్సి ఉండగా అన్నయ్య హాజరయ్యాడు. అసలు అభ్యర్ధికి బదులు డూప్లికేట్ అభ్యర్థి పరీక్షకు హాజరైనట్లు పరీక్ష నిర్వహణ అధికారులు ఆరోపించారు. వెంటనే పోలీసులను పిలిపించగా.. సోదరులిద్దరినీ అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

నీట్ యూజీ పరీక్ష ఆదివారం (మే 5) జరిగింది. ఇందుకోసం బార్మర్‌లో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటన అంత్రిదేవి ప్రభుత్వ హయ్యర్‌ సెకండరీ పాఠశాలలో చోటుచేసుకుంది. పరీక్ష కేంద్రంలోని ఇన్విజిలేటర్‌కు పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థిపై అనుమానం వచ్చి తనిఖీలు చేయగా.. అతను నకిలీ అభ్యర్థిగా తేలింది. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అతడిని అదుపులోకి విచారించగా.. నిజం అంగీకరించాడు. తన పేరు భగీరథ్ రామ్ అని.. తన తమ్ముడు గోపాల్ రామ్ స్థానంలో డమ్మీ అభ్యర్థిగా పరీక్ష రాసేందుకు వచ్చినట్లు పోలీసులకు తెలిపాడు. కాగా భగీరథ్ రామ్ గతేడాదే నీట్‌ యూజీ పరీక్షను క్లియర్‌ చేశాడు. అనేక ప్రయత్నాల తర్వాత అతడు NEET పరీక్షలో విజయం సాధించాడు. ప్రస్తుతం జోధ్‌పూర్ మెడికల్ కాలేజీలో భగీరథ్ రామ్ ఎంబీబీఎస్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు.

తమ్ముడి స్థానంలో పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన భగీరథ రామ్ అనేక ప్రయత్నాల తర్వాత గతేడాది జరిగిన నీట్ యూజీ పరీక్షలో విజయం సాధించాడని, జోధ్‌పూర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం చదువుతున్నట్లు విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. తన తమ్ముడిని డాక్టర్‌ని చేసేందుకు, అతడి స్థానంలో నకిలీ అభ్యర్థిగా పరీక్ష రాయడానికి వచ్చి పట్టుబడినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు భగీరథ్‌తోపాటు, అతడి సోదరుడు గోపాల్ రామ్‌తోపాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..