డైనింగ్ టేబుల్‌పై ఆక్టోపస్ పరుగో పరుగు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

కొందరికి ఇంట్లో తయారుచేసిన నాన్ వెజ్ అంటే ఇష్టం. మరికొంతమందికి హోటల్ లేదా రెస్టారెంట్ లో రెడీ చేసే నాన్ వెజ్ అంటే ఇష్టం. అయితే  నాన్ వెజ్ తినడానికి రెస్టారెంట్ లో కూర్చుంటే ఎవరూ ఊహించని విధంగా జరిగితే ఒక సంఘటన జరిగితే ఎవరైనా షాక్ తినాల్సిందే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఇలాంటి షాకింగ్ దృశ్యం కనిపిస్తుంది.

డైనింగ్ టేబుల్‌పై ఆక్టోపస్ పరుగో పరుగు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Octopus Video Viral
Follow us

|

Updated on: May 07, 2024 | 12:47 PM

ప్రపంచం శాఖాహారం వైపు వేగంగా దూసుకుపోతోందని చెబుతున్నారు. అయినప్పటికీ ప్రపంచంలో చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు అంటూ నాన్ వెజ్ తినడానికి ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. నాన్ వెజ్ తినే ఆహారంలో లేకపోతె అసలు తినడానికి ఇష్టపడరు. కొందరికి ఇంట్లో తయారుచేసిన నాన్ వెజ్ అంటే ఇష్టం. మరికొంతమందికి హోటల్ లేదా రెస్టారెంట్ లో రెడీ చేసే నాన్ వెజ్ అంటే ఇష్టం. అయితే  నాన్ వెజ్ తినడానికి రెస్టారెంట్ లో కూర్చుంటే ఎవరూ ఊహించని విధంగా జరిగితే ఒక సంఘటన జరిగితే ఎవరైనా షాక్ తినాల్సిందే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఇలాంటి షాకింగ్ దృశ్యం కనిపిస్తుంది.

నిజానికి ఒక రెస్టారెంట్‌లో డైనింగ్ టేబుల్‌పై వివిధ రకాల ఆహార పదార్థాలు అందించబడ్డాయి. అందులో లైవ్ ఆక్టోపస్ కూడా ఉంది. ఆ ఆక్టోపస్ అకస్మాత్తుగా వడ్డించే పాత్ర నుంచి బయటకు వచ్చి పారిపోవటం ప్రారంభించింది. టేబుల్‌పై నడుస్తున్న ఆక్టోపస్ ఎలా ముందుకు కదులుతుందో.. టేబుల్ మీద నుంచి  క్రిందికి దిగడానికి ప్రయత్నిస్తున్నది వీడియోలో చూడవచ్చు. ఈ దృశ్యం నిజంగా షాకింగ్ దృశ్యం. ఈ వింత సంఘటన ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ, జపాన్ , కొరియా, చైనా వంటి చాలా దేశాలలో ప్రజలు ఆక్టోపస్ మాంసాన్ని కూడా తింటారు. కొన్ని బతికి ఉన్న ఆక్టోపస్ ను కూడా తింటారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోపై ఓ లుక్ వేయండి..

ఈ షాకింగ్ వీడియో బెస్ట్ ఫిషింగ్ 2024 పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది.  ఇది ఇప్పటివరకు 37 మిలియన్ల కంటే ఎక్కువ సార్లు వీక్షించబడింది. అంతేకాదు 4.5 లక్షల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేసారు.

అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ఒకరు కోపంతో ఇలా వ్రాశారు, ‘జంతువులు కూడా జీవించాలని కోరుకుంటాయి. మనిషి జీవించి ఉన్న జంతువులను కూడా తినేంత క్రూరంగా మారుతున్నాడు’ అని కామెంట్ చేయగా… మరొకరు ‘ఇది చాలా విచారకరం. మనుషులు ఈ భూమ్మీద జీవించడానికి అనర్హులని పేర్కొన్నాడు. అదేవిధంగా ఒకరు ‘ఈ వీక్షణ భయానకంగా ఉంది. ఇలాంటి ఘటనే తాను తినే టేబుల్ మీద జరిగి ఉంటే.. అప్పటి తన పరిస్థితి వర్ణాతీతం అని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..