నంద్యాల జిల్లాలో వర్షం, వడగండ్ల వాన బీభత్సం.. పక్షులు విలవిల.. చల్లగా మారిన వాతావరణం..

నంద్యాల జిల్లాలో తెల్లవారుజామున 3 గంటల నుంచి కురిసిన ఈ వర్ష బీభత్సం సృష్టించింది. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. రేకుల షెడ్లు ఎగిరి 20 అడుగుల దూరంలో పడిపోయాయి. చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరడంతో తెల్లవారుజామున నుంచి పలు గ్రామాల్లో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది.

నంద్యాల జిల్లాలో వర్షం, వడగండ్ల వాన బీభత్సం.. పక్షులు విలవిల.. చల్లగా మారిన వాతావరణం..
Heavy Rains In Nandyala '
Follow us

| Edited By: Surya Kala

Updated on: May 07, 2024 | 10:45 AM

నంద్యాల జిల్లా వర్షం బీభత్సం సృష్టించింది. ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాలలో గాలివాన , వడగండ్లతో బీభత్సం సృష్టించింది. మండల పరిధిలోని ముష్టపల్లె, సిద్ధపల్లె ,పెద్ద అనంతాపురం, నల్లకాల్వ గ్రామాలలో వడగండ్ల వాన దాటికి పక్షులు విలవిలలాడాయి. కొన్ని పక్షులు చనిపోగా.. మరి కొన్ని పక్షులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి.  కొంగలు, రామ చిలకలు, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ చనిపోతుండడంతో పక్షి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెల్లవారుజామున 3 గంటల నుంచి కురిసిన ఈ వర్ష బీభత్సం సృష్టించింది. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. రేకుల షెడ్లు ఎగిరి 20 అడుగుల దూరంలో పడిపోయాయి. చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరడంతో తెల్లవారుజామున నుంచి పలు గ్రామాల్లో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఆత్మకూరు పరిధిలో ఎండ వేడిమి 45 నుంచి 46  డిగ్రీలు నమోదవుతూ నిప్పుల కొలిమిగా మారిన ఆత్మకూరు ఈ రోజు కురిసిన వర్షానికి కాస్త చల్లబడింది. సుమారు గంటసేపు భారీ ఈదురు గాలులతో ఉరుములు మెరుపులతో కురిసిన వర్షం వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. ఈ వర్షంతో రైతులకు వేసవి సాగు చేసుకోవడానికి సరిపోతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!