AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కట్టలు కాదు.. నోట్ల గుట్టలు.. తీగ లాగితే.. పనిమనిషి ఇంట్లో డొంక కదిలింది.. దేశంలోనే సంచలనం..

గుట్టలు కాదు.. నోట్ల కట్టలు.. అంతా బ్లాక్ మనీనే.. జార్ఖండ్‌ మనీలాండరింగ్‌ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది.. జార్ఖండ్‌ మంత్రి ఆలంగిర్‌ కార్యదర్శి సంజీవ్‌ పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడడం తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే.. మంత్రి ఆలంగీర్‌ సెక్రటరీ ఇంట్లో తీగ లాగితే.. పనిమనిషి ఇంట్లో డొంక కదిలింది..

కట్టలు కాదు.. నోట్ల గుట్టలు.. తీగ లాగితే.. పనిమనిషి ఇంట్లో డొంక కదిలింది..  దేశంలోనే సంచలనం..
Alamgir Alam
Shaik Madar Saheb
|

Updated on: May 07, 2024 | 6:27 PM

Share

గుట్టలు కాదు.. నోట్ల కట్టలు.. అంతా బ్లాక్ మనీనే.. జార్ఖండ్‌ మనీలాండరింగ్‌ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది.. జార్ఖండ్‌ మంత్రి ఆలంగిర్‌ కార్యదర్శి సంజీవ్‌ పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడడం తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే.. మంత్రి ఆలంగీర్‌ సెక్రటరీ ఇంట్లో తీగ లాగితే.. పనిమనిషి ఇంట్లో డొంక కదిలింది.. అక్షరాలా 35.23 కోట్లు పట్టుబడ్డాయి. రెండు రోజుల పాటు లెక్కేసిన అధికారులు మొత్తం క్యాష్‌ను సీజ్‌ చేశారు. ఇంకా చెప్పాలంటే ఇదంతా బ్లాక్‌మనీనే. జార్ఖండ్‌ రాజధాని రాంచీ లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సోమవారం వరుస దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో కొన్ని పథకాల అమలులో అవకతవకలు జరగడంతో మనీ లాండరింగ్ కేసు నమోదైంది.

ఈ వ్యవహారంలో గతేడాది ఫిబ్రవరిలో ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్‌ను ఈడీ అరెస్టు చేసింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు రాంచీలోని సుమారు 10 ప్రాంతాల్లో ఏకాలంలో వరుస దాడులు నిర్వహించారు. భారీగా సిబ్బందిని మోహరించి.. పకడ్బంధీగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగీర్ ఆలం వ్యక్తిగత సహాయకుడు సంజీవ్ లాల్ నౌకర్ (పనిమనిషి) ఇంట్లో కట్టలు కట్టలుగా నగదు బయటపడింది. దీంతో అతనితోపాటు సంజీవ్‌లాల్‌ ను ఈడీ అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

కాగా.. గత కొన్ని రోజుల నుంచి జార్ఖండ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మనీలాండరింగ్ కేసు అందరి మెడకు చుట్టుకుంటోంది. భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో ఇప్పటికే (ఫిబ్రవరిలో) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత, సీఎం హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేశారు. అరెస్టుకు ముందు హేమంత్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ విచారణ కొనసాగుతుండగానే.. మంత్రి ఆలంగీర్ సెక్రటరీ అరెస్టవ్వడం రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఇద్దరి విచారణ తర్వాత కాంగ్రెస్ నాయకుడు, జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ను కూడా ఈడీ అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం నగదు రికవరీ రూ.35.23 కోట్లుగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఈ ఘటనపై ఆలం స్పందిస్తూ.. తాను ఎటువంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శ్రీదేవి తర్వాత అంత అందగత్తె.. కానీ తల్లి చేసిన పనికి
శ్రీదేవి తర్వాత అంత అందగత్తె.. కానీ తల్లి చేసిన పనికి
గూగుల్ మ్యాప్స్‌లో సూపర్ ఫీచర్.. ఆన్ చేస్తే.. పెట్రోల్ ఆదా
గూగుల్ మ్యాప్స్‌లో సూపర్ ఫీచర్.. ఆన్ చేస్తే.. పెట్రోల్ ఆదా
కూర్చొనే అవకాశం కూడా లేదే.. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల నరక యాతన
కూర్చొనే అవకాశం కూడా లేదే.. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల నరక యాతన
హైదరాబాద్‌లోని ఆ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు.. ఎక్కడో తెలుసా?
హైదరాబాద్‌లోని ఆ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు.. ఎక్కడో తెలుసా?
ఐదోసారి తండ్రి కాబోతున్న ఫుట్‌బాల్ స్టార్
ఐదోసారి తండ్రి కాబోతున్న ఫుట్‌బాల్ స్టార్
అరేయ్ ఏంట్రా ఈ అరాచకం.. రూ.70 వేల అప్పుకు ఎంత వసూలు చేశారో తెలుసా
అరేయ్ ఏంట్రా ఈ అరాచకం.. రూ.70 వేల అప్పుకు ఎంత వసూలు చేశారో తెలుసా
టెలిగ్రామ్ చానెళ్లపై కేంద్రం బ్యాన్‌.. NTA రియాక్షన్ ఇదే
టెలిగ్రామ్ చానెళ్లపై కేంద్రం బ్యాన్‌.. NTA రియాక్షన్ ఇదే
గుడ్ న్యూస్.. వారికి APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం! పూర్తివివరాలు
గుడ్ న్యూస్.. వారికి APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం! పూర్తివివరాలు
దగ్గు మందు అమ్మకాలపై కేంద్రం సంచలన నిర్ణయం!
దగ్గు మందు అమ్మకాలపై కేంద్రం సంచలన నిర్ణయం!
తల్లికి వందనం అర్హత చెక్ చేసుకోవడం ఎలా? జస్ట్ ఆధార్ నెంబర్‌తో..
తల్లికి వందనం అర్హత చెక్ చేసుకోవడం ఎలా? జస్ట్ ఆధార్ నెంబర్‌తో..