Tamilnadu: చిల్లి చికెన్ పేరుతో గబ్బిలాల ఫ్రై… మీరు తింటుంది చిల్లీ చికెనేనా ఓసారి చూసుకోండి!
తెలంగాణ, ఏపీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతుండగానే తమిళనాడులో కళ్లు బైర్లు కమ్మే సంఘటన వెలుగులోకి వచ్చింది. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఆహార పదార్థాలు విక్రయించే, తయారుచేసే వ్యాపార సంస్థలపై ఆకస్మిక దాడులు జరిపేందుకు తమిళనాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు సిద్దమయ్యారు. ఎందుకంటే...

తెలంగాణ, ఏపీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతుండగానే తమిళనాడులో కళ్లు బైర్లు కమ్మే సంఘటన వెలుగులోకి వచ్చింది. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఆహార పదార్థాలు విక్రయించే, తయారుచేసే వ్యాపార సంస్థలపై ఆకస్మిక దాడులు జరిపేందుకు తమిళనాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు సిద్దమయ్యారు. ఎందుకంటే.. అక్కడ ఓ దారుణం జరిగిపోతుంది. ఈ వార్త చదివాక మీరు తింటుంది చిల్లీ చికెనేనా? తినేముందే ఒకసారి చెక్ చేసుకోండి.. ఎందుంటే తమిళనాడులో చిల్లీ చికెన్ పెరుతో గబ్బిలాల మాంసం అమ్మేస్తున్నారు.
తమిళనాడులోని సేలం జిల్లాలో గబ్బిలాల మాంసం కలకలం రేపింది. చికెన్ పేరిట గబ్బిలాల మాంసాన్ని హోటల్స్‌కు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు చేరవేసే ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటవీప్రాంతంలో నాటు తుపాకులతో గబ్బిలాల వేటాడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.
అయితే విచారణలో వాళ్లు దిమ్మతిరిగిపోయే విషయాలు చెప్పారు. ఆ గబ్బిలాలను వేటాడి.. వాటిని చంపి ఆ మాంసాన్ని చికెన్ పేరిట హోటల్స్‌కు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు సప్లై చేస్తున్నట్లు చెప్పారు. దీంతో పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులను అపమత్తం చేశారు. సేలం, కమల్ ఇచ్చిన సమాచారంతో నగరంలోని పలు రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌సెంటర్లపై పోలీసులు తనిఖీలకు సిద్ధమయ్యారు.
