AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమించి పెళ్లాడాడు.. నాలుగు నెలలకే భార్యను మరో వివాహం చేసుకోమని టార్చర్.. చివరకు ఆ వధువు..

అత్తింటి ఆరళ్లకు మరో అభాగిని బలైపోయింది. ప్రేమించి పెళ్లాడిన భర్త శాడిస్ట్‌లా మారటంతో లక్నోలో ఓ కానిస్టేబుల్‌ భార్య ఉరితాడుకు వేలాడింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో వివాహిత సెల్ఫీ సూసైడ్‌ కలకలం రేపింది. ప్రేమించి పెళ్లాడి తన భర్త కట్నంకోసం వేధింపులకు గురిచేశాడని.. అత్తామామలు కూడా తీవ్రంగా వేధించారని ఆత్మహత్యకు ముందు వివాహిత వీడియోలో వెల్లడించింది..

ప్రేమించి పెళ్లాడాడు.. నాలుగు నెలలకే భార్యను మరో వివాహం చేసుకోమని టార్చర్.. చివరకు ఆ వధువు..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Jul 28, 2025 | 11:09 AM

Share

అత్తింటి ఆరళ్లకు మరో అభాగిని బలైపోయింది. ప్రేమించి పెళ్లాడిన భర్త శాడిస్ట్‌లా మారటంతో లక్నోలో ఓ కానిస్టేబుల్‌ భార్య ఉరితాడుకు వేలాడింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో వివాహిత సెల్ఫీ సూసైడ్‌ కలకలం రేపింది. ప్రేమించి పెళ్లాడి తన భర్త కట్నంకోసం వేధింపులకు గురిచేశాడని.. అత్తామామలు కూడా తీవ్రంగా వేధించారని ఆత్మహత్యకు ముందు వివాహిత వీడియోలో వెల్లడించింది.. వివరాల ప్రకారం.. లక్నో బికెటి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న అనురాగ్ సింగ్.. సౌమ్య నాలుగు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం అనురాగ్ సింగ్ కట్నం తీసుకురావాలంటూ వేధించడం మొదలుపెట్టాడు.. భర్తతో పాటు అత్తామమ, అతని బావ, బావ సోదరుడి వేధింపులు ఎక్కువయ్యాయి.. సౌమ్య భర్త బావ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోనే పనిచేస్తుండటంతో.. డబ్బు, అధికారం చూసుకుని సౌమ్య కశ్యప్‌కి అత్తింటి టార్చర్‌ మరింత పెరిగింది.. వేరే వివాహం చేసుకోవాలని సౌమ్యపై అత్తింటి వారు ఒత్తిడి తెచ్చారు.. నిస్సహాయులైన బేటీలకు రక్షణ ఏదంటూ సెల్ఫీ సూసైడ్‌ చేసుకుంది.. కాగా.. సౌమ్య కశ్యప్‌ చివరి వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అయింది.

తన జీవితాన్ని ముగించే ముందు, సౌమ్య తన అత్తమామలపై తీవ్రమైన ఆరోపణలు చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ క్లిప్‌లో, ఆమె తన భర్త, బక్షి కా తలాబ్ పోలీస్ స్టేషన్‌లో ఈగిల్ మొబైల్ యూనిట్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అనురాగ్ సింగ్‌ను తిరిగి వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశారని.. వారు తనను మానసికంగా వేధించారని ఆమె ఆరోపించింది. తన బావమరిది తనను చంపేస్తానని బెదిరించిందని కూడా ఆమె ఆరోపించింది.

వీడియో చూడండి..

డబ్బుతో వాళ్లు ఏమైనా చేయగలరు. న్యాయంకోసం ఠాణాల చుట్టూ తిరిగినా తన గోడు ఎవరూ వినలేదని ఆత్మహత్యకు ముందు వెక్కివెక్కి ఏడుస్తూ మరణవాంగ్మూలం ఇచ్చింది బాధితురాలు‌.. తనని ఇంతగా హింసించి బతకలేని పరిస్థితులు కల్పించిన ఎవరినీ వదలొద్దు.. అంటూ సూసైడ్‌కి ముందు సెల్ఫీ వీడియోలో వేడుకుంది సౌమ్య కశ్యప్‌.

అనంతరం సౌమ్య తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణించినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రారంభించిన తర్వాత పోలీసులను అప్రమత్తం చేశారు. మెయిన్‌పురిలో నివసిస్తున్న సౌమ్య కుటుంబానికి సమాచారం అందింది.. అయితే.. వారు అప్పుడు లక్నోకు వెళ్తున్నారని పిటిఐ నివేదించింది. కుటుంబం అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాత కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..