అడవిలో బంకర్‌లాంటి నిర్మాణం.. తవ్వగా బయటపడ్డ నోట్ల కట్టలు.. అక్కడికెలా వచ్చేయో తెలిస్తే..
ఝార్ఖండ్‌లోని అటవీ ప్రాంతంలో భారీ మొత్తంలో నగదును గుర్తించారు భద్రతా సిబ్బంది. సింగ్భూమ్ జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత కారైకేలా ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలిస్తున్న క్రమంలో.. భద్రతా సిబ్బందికి ఒక బంకర్ లాంటి నిర్మాణం కనిపించింది. దాన్ని తవ్వి చూడగా అందులో డబ్బుల కట్టలు బయపడ్డాయి. దొరికిన నగదు మొత్తం రూ. 35లక్షల వరకు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.

ఝార్ఖండ్‌లోని అటవీ ప్రాంతంలో భారీ మొత్తంలో నగదును గుర్తించారు భద్రతా సిబ్బంది. సింగ్భూమ్ జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత కారైకేలా ప్రాంతాల్లో మావోయిస్టు కదలికలు ఉన్నాయన్న పక్కా సమాచారంతో జార్ఖండ్ పోలీసులు, సీఎఆర్పీఎఫ్, భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్‌లో భాగంగా మావోయిస్టుల కోసం గాలిస్తున్న పోలీసులు, భద్రతా సిబ్బందికి ఒక బంకర్ వంటి నిర్మాణం కనిపించింది. దీంతో అధికారులు వెంటనే అ బంకర్‌ను తవ్వి అందులో ఏముందోనని పరిశీలించారు. అయితే అందులో రెండు డబ్బాలు ఉన్నట్టు గుర్తించారు. వాటిని బయటకు తీసి ఓపెన్ చేసి చూడగా అందులో రూ.35లక్షల విలువైన నగదు బయటపడింది. అయితే ఈ మొత్తాన్ని ఎస్పీ రాకేశ్ రంజన్ తెలిపారు
पश्चिमी सिंहभूम, चाईबासा जिला में प्रतिबंधित भा०क०पा० (माओ०) नक्सली संगठन के उग्रवादियों के आर्थिक स्त्रोत पर अबतक का सबसे बड़ा प्रहार-₹34.99 लाख नकद बरामद@jhar_governor @JharkhandCMO @HMOIndia @JharkhandPolice @Michaelraj_ips @IGRanchi @crpfindia @CRPF_Jharkhand @DC_Chaibasa pic.twitter.com/pVlzoMW4Bv
— Chaibasa Police (@ChaibasaPolice) July 27, 2025
ఆ నదగును స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఆ డబ్బును మావోయిస్టులే దాచి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాల వంటికి కొనుగోలు చేసేందుకు ఈ డబ్బును బంకర్ దాచి పెట్టి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది. ఇక్కడికి ఎలా తీసుకొచ్చారనే దానిపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




