AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడ్రస్ వెరిఫికేషన్ కోసం వచ్చిన మహిళా ఉద్యోగికి ముద్దు పెట్టిన కస్టమర్‌.. కట్‌చేస్తే..

ముంబైలో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. అడ్రస్‌ వెరిఫికేషన్‌ కోసం వచ్చిన మహిళా ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి కోర్టు ఏడాది శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించింది. ఈ ఘటన 2020లో జరగగా తాజాగా నిందితుడికి కోర్టు శిక్ష వేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది.

అడ్రస్ వెరిఫికేషన్ కోసం వచ్చిన మహిళా ఉద్యోగికి ముద్దు పెట్టిన కస్టమర్‌.. కట్‌చేస్తే..
Mumbai
Anand T
|

Updated on: Jul 28, 2025 | 9:22 AM

Share

అడ్రస్‌ వెరిఫికేషన్‌ కోసం వచ్చిన మహిళా ఉద్యోగితో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన ముంబైలోని బోరివలిలో వెలుగు చూసింది. ఈ ఘటన 2020లో జరగగా తాజాగా నిందితుడికి కోర్టు శిక్ష వేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరివలికి చెందిన నరేంద్ర రఘునాథ్ సగ్వేకర్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్‌ బ్యాంక్‌తో కొత్త ఖాతా రవడానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇక సాధారణ ప్రక్రియలో భాగంగా సదరు బ్యాంక్‌లో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగిని.. 2020 నవంబర్ 27న అడ్రస్ విరిఫికేషన్‌ కోసం సగ్వేకర్ నివాసానికి వచ్చింది.

ఈ క్రమంలో సగ్వేకర్ సదురు మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అమెను అనుచితంగా తాకి ముద్దు పెట్టుకున్నట్టు బాధితురాలు ఆరోపించింది. దీంతో ఎలాగోలా సగ్వేకర్ నుంచి తప్పించుకున్న సదురు మహిళా ఉద్యోగి వెంటనే బ్యాంక్‌కు చేరుకొని అక్కడ జరిగిన విషయం మొత్తాన్ని మేనేజర్, సిబ్బందికి తెలిపింది. దీంతో బ్యాంక్‌ అధికారులు బాధిత మహిళతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సగ్వేకర్‌పై ఫిర్యాదు చేశారు.

బాధితురాలి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో భాగంగా నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత అతన్ని కోర్టులో హాజరుపర్చారు. ఘటనపై విచారణ సందర్భంగా మహిళ వాంగ్మూలంలో తప్పులు ఉన్నాయని, అంతేకాకుండా ప్రత్యక్ష సాక్షాలు కూడా ఎవరూ లేరని సగ్వేకర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు మహిళా ఉద్యోగి తరపు న్యాయవాది అతని వాదనలుల్లో వాస్తవం లేదని తెలిపారు. ఇదరువైపుల వాదనలు విన్న కోర్టు మహిళ వాదన స్థిరంగా, నమ్మదగిందిగా ఉందని అభిప్రాయపడ్డారు.

ఈ క్రమంలో సగ్వేకర్ అనే వ్యక్తిని దోషిగా తేల్చుతా అతడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు అతని ఏడాది జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. కోర్టు ఆదేశాలతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జైలుకు తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా