Vande Bharat Express: గేదెలను ఢీకొన్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. ధ్వంసమైన ఇంజన్‌ ముందు భాగం..

100 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వాస్తవానికి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ గంటలకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది.

Vande Bharat Express: గేదెలను ఢీకొన్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. ధ్వంసమైన ఇంజన్‌ ముందు భాగం..
Vande Bharat Train
Follow us

|

Updated on: Oct 06, 2022 | 4:17 PM

ప్రారంభించిన వారం రోజుల తరువాత వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురి కావడం సంచలనం రేపింది. గేదెల గుంపు అడ్డం రావడంతో లోకో పైలట్‌ సడెన్‌ బ్రేక్ వేశారు. దీంతో ఇంజన్‌ ముందు భాగం దెబ్బతింది. అయితే ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ముంబై సెంట్రల్‌ నుంచి గుజరాత్‌ లోని గాంధీనగర్‌కు వస్తున్న సమయంలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురయ్యింది. గుజరాత్‌లోని వాత్వా స్టేషన్‌ దగ్గర గురువారం ఉదయం 11.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇంజన్‌ ముందు భాగం మాత్రమే ధ్వంసమైనట్లు రైల్వే సీనియర్ పీఆర్వో జేకే జయంత్ తెలిపారు. ఈ ప్రమాదంలో నాలుగు గేదెలు చనిపోయాయి.

100 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వాస్తవానికి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ గంటలకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఘటన జరిగిన సమయంలో 100 కిమీ వేగంతోనే ఉండంటం.. ఇంజిన్ ముందు భాగం ధ్వంస కావడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైల్‌ ఇంజన్‌ నాణ్యతపై పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ సెప్టెంబర్‌ 30వ తేదీన ప్రధాని న‌రేంద్ర మోడీ ప్రారంభించారు. ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన అనంత‌రం ప్రధాని మోదీ.. గాంధీ న‌గ‌ర్ నుంచి కాలుపూర్ రైల్వే స్టేష‌న్ వరకు ప్రయాణించారు. ఈ ఎక్స్‌ప్రెస్ గాంధీ న‌గ‌ర్ – ముంబై మ‌ధ్య రాకపోకలు సాగిస్తోంది.

ఈ సెమీ హైస్పీడ్ రైలు.. అత్యాధునిక ప్రమాణాలతో మంచి ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. ఇది గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. రైళ్లు పరస్పరం ఢీకొట్టుకోకుండా నివారించేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన కవచ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా దీనికి అనుసంధానించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..