Thailand Shooting: థాయ్‌లాండ్‌లో దారుణం.. చిన్నారులపై మాజీ పోలీసు అధికారి కాల్పులు.. 34 మంది మృతి
థాయిలాండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మాజీ పోలీసు అధికారి జరిపిన కాల్పుల్లో 34 మంది దుర్మరణం చెందారు. చనిపోయిన వారిలో 22 మంది చిన్నారులు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
థాయిలాండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మాజీ పోలీసు అధికారి జరిపిన కాల్పుల్లో 34 మంది దుర్మరణం చెందారు. చనిపోయిన వారిలో 22 మంది చిన్నారులు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. థాయిలాండ్ నార్త్ఈస్ట్రన్ ప్రావిన్స్‌లోని నాంగ్ బులా లామ్ ఫూలో చిల్డ్రన్ డే కేర్ సెంటర్‌లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో సుమారు 35 మంది మరణించినట్లు థాయిలాండ్ మీడియా వెల్లడించింది. మరణించిన వారిలో చిన్నారులు ఎక్కువమంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సామూహిక కాల్పులకు పాల్పడింది ఓ మాజీ పోలీసు అధికారి అని వెల్లడించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నేరస్థుడైన మాజీ పోలీసు అధికారిని పట్టుకోవాలని ప్రధాని సైతం ఆదేశించారు. ఈ మేరకు అన్ని ఏజెన్సీలను అప్రమత్తం చేసినట్లు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. మృతుల్లో 23 మంది చిన్నారులు , 12 మంది టీచర్లు ఉన్నారు. గాయపడ్డ వాళ్లలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని వాళ్లకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని పోలీసులు తెలిపారు.
కాల్పుల అనంతరం నేరస్థుడైన మాజీ పోలీసు అధికారి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. తన భార్యా పిల్లలను చంపి నేరస్థుడు పాన్యాకామ్రాబ్ తనను తాను కాల్చుకున్పాడని తెలిపారు. అయితే ఆ వ్యక్తి చైల్డ్ కేర్ సెంటర్‌లో ఎందుకు కాల్పులు జరపాడన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పాన్యా కామ్రాబ్ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఉద్యోగం నుంచి తొలగించింది పోలీసు శాఖ . అప్పటి నుంచి అధికారుల తీరుపై అతడు ఆగ్రహంతో ఉన్నాడు.
కాగా.. థాయిలాండ్‌లో సామూహిక కాల్పుల ఘటనలు చాలా అరుదు. 2020లో ఓ సైనికుడు ఓ ప్రాపర్టీ విషయంలో కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో 29 మంది మరణించారు. 57 మంది గాయపడ్డారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి