ఇక కోవిన్ ద్వారానే వ్యాక్సిన్ ఆర్దర్లు.. ప్రైవేటు ఆస్పత్రులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. రేపటి నుంచే అమలు
ప్రైవేటు ఆస్పత్రులు వ్యాక్సిన్ ఆర్దర్ల కోసం ఇక కోవిన్ పైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి కేంద్రం కొత్త మార్దర్శకాలను విడుదల చేసింది. ఇవి కోవిన్ ద్వారానే ఆర్దర్లు ఇవ్వాలని, ఉత్పత్తిదారుల నుంచి నేరుగా కొనుగోలు చేయరాదని సూచించింది.
ప్రైవేటు ఆస్పత్రులు వ్యాక్సిన్ ఆర్దర్ల కోసం ఇక కోవిన్ పైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి కేంద్రం కొత్త మార్దర్శకాలను విడుదల చేసింది. ఇవి కోవిన్ ద్వారానే ఆర్దర్లు ఇవ్వాలని, ఉత్పత్తిదారుల నుంచి నేరుగా కొనుగోలు చేయరాదని సూచించింది. ఒక నెలలో ఈ ఆస్పత్రులకు గరిష్టంగా ఎన్ని డోసుల వ్యాక్సిన్ అవసరమవుతుందంటూ దీనికి ఓ పరిమితిని ప్రభుత్వం విధించింది. దీనివల్ల లిమిటెడ్ సప్లయ్ ఉంటుందని, పైగా టీకామందు వృధా కాకుండా ఉంటుందని ఈ గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు. జులై 1 నుంచి ఈ గైడ్ లైన్స్ అమలులోకి వస్తాయి. ఏ 7 రోజుల పీరియడ్ లో నైనా సగటున రోజువారీ వ్యాక్సిన్ వినియోగాన్ని రెట్టింపు చేయడానికి అవసరమైన ఫార్ములా కూడా వీటిలో ఉంది. తద్వారా ఒక హాస్పిటల్ కి గరిష్ట నెలవారీ పరిమితిని లెక్క కట్టడానికి వీలవుతుంది. ఉదాహరణకు ఓ ఆసుపత్రి జులై నెలకు ఆర్డర్ చేయదలిస్తే..అది ఏడు రోజుల పీరియడ్ గా 10-16 ను ఎంచుకోవచ్చు..ఈ 7 రోజుల్లో ఈ ఆసుపత్రి 700 డోసుల వ్యాక్సిన్ ని వినియోగించుకుంటే సగటున రోజువారీ వినియోగం 100 డోసులవుతుందని ప్రభుత్వం లెక్క కట్టింది.
మొటిసారిగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతున్న వ్యాక్సిన్ కేటాయింపు వాటిలోని బెడ్స్ లభ్యతపై ఆధారపడి ఉంటుంది. అన్ని ప్రైవేటు ఆస్పత్రులు కోవిన్ డేటా బేస్ లో అవసరమైన వివరాలను పొందుపరచవలసి ఉంటుంది. దీని ద్వారా రాష్ట్ర, జిల్లా స్థాయి డిమాండును అంచనా వేసి ఆ తరువాత సమాచారాన్ని ఉత్పత్తిదారులకు పంపుతారు. కాగా ప్రభుత్వ అధికారుల నుంచి ముందే అను,మతి తీసుకోవలసిన అవసరం లేదు. ఈ ఆస్పత్రులకు 75-25 నిష్పత్తిలో వ్యాక్సిన్ కేటాయింపు విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యక్తం చేసిన సందేహాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్టు కనబడుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: లీకైన హరిహర వీర మల్లు పవన్ కళ్యాణ్ ఫైట్ సీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్:Hara Hara Veera Mallu video leaked
పెళ్లి పందిట్లో మైక్ ఆన్ లో ఉండగ వధూవరుల ముచ్చట్లు వధూవరుల ముచ్చట్లు నెట్ లో హల్ చల్:Viral Video.