Vaccine mix-up: జార్ఖండ్‌లో ఆరుగురికి మిక్సిడ్ వ్యాక్సిన్.. ఫస్ట్ డోస్ కోవాక్సిన్.. సెకండ్ డోస్‌గా..
Different Corona vaccine Jabs: దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో కొన్ని తప్పిదాలు చోటుచేసుకుంటున్న సంఘటనలు
Different Corona vaccine Jabs: దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో కొన్ని తప్పిదాలు చోటుచేసుకుంటున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. జార్ఖండ్ రాష్ట్రంలోని పాలాము జిల్లాలో ఆరుగురికి అధికారులు పొరపాటున రెండు వేర్వేరు కంపెనీల కరోనా వ్యాక్సిన్లు ఇచ్చారు. ఈ ఆరుగురు మొదటి డోసు కోవాగ్జిన్ తీసుకున్నారు. అయితే.. బుధవారం వీరికి రెండో డోసును మాత్రం అధికారులు కోవిషీల్డ్ వేశారు. మిక్స్‌డ్ వ్యాక్సిన్ వల్ల ప్రస్తుతం వారిలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించడం లేదని, ఆరోగ్యంగానే ఉన్నారని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనిల్‌కుమార్ సింగ్ ఈ సంఘటన అనంతరం వెల్లడించారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మొదట తాము కోవిషీల్డ్ తీసుకోలేదని వెల్లడించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
హరిహరగంజ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు బుధవారం రెండో డోసు కోసం లబ్ధిదారులు వెళ్లారు. ఈ క్రమంలో… వారి నుంచి వివరాలు సేకరించని సిబ్బంది పొరపాటున కోవిషీల్డ్ ఇచ్చారని తెలిపారు. ఈ విషయం తెలియగానే హెల్త్ సెంటర్‌లో స్వల్ప ఉద్రిక్తత నెలకొందని తెలిపారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దారు. కాగా.. ఈ ఆరుగురిని మరో 24 గంటలపాటు పరిశీలనలో ఉంచనున్నట్లు అనిల్ కుమార్ సింగ్ తెలిపారు.
Also Read: