కర్ణాటకలో ‘కమలం’ షేపులో షిమోగా విమానాశ్రయ నిర్మాణం… కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం

కర్ణాటకలోని షిమోగా జిల్లాలో విమానాశ్రయాన్ని కమలం (లోటస్) ఆకారంలో నిర్మిస్తుండడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఇది బీజేపీ ఎన్నికల చిహ్నమని ఈ పార్టీ అధికార ప్రతినిధి బ్రిజేష్ కాలప్ప ఆరోపించారు.

కర్ణాటకలో 'కమలం' షేపులో షిమోగా విమానాశ్రయ నిర్మాణం... కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం
Lotus Shape Airport

కర్ణాటకలోని షిమోగా జిల్లాలో విమానాశ్రయాన్ని కమలం (లోటస్) ఆకారంలో నిర్మిస్తుండడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఇది బీజేపీ ఎన్నికల చిహ్నమని ఈ పార్టీ అధికార ప్రతినిధి బ్రిజేష్ కాలప్ప ఆరోపించారు. పైగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప కూడా ఇదే జిల్లాకు చెందినవారని ఆయన చెప్పారు. ఈ ఎయిర్ పోర్టు టెర్మినల్ ని వచ్చే ఏడాది అంతానికల్లా పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారని ఆయన అన్నారు. బీజేపీ చిహ్నంగా ఉన్న ఈ నిర్మాణ రూపం పట్ల కాలప్ప అభ్యంతరం ప్రకటిస్తూ… పార్టీ గుర్తుతో పోలి ఉండే ఎలాంటి నిర్మాణాలను ప్రజాధనంతో చేపట్టరాదని ఢిల్లీ హైకోర్టు 2016 లోనే ఆదేశించిందని చెప్పారు/ దీనిపై తాము కోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. అయితే బీజేపీ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ కమలం జాతీయ పుష్పమని…తమ పార్టీ గుర్తుకు, దీనికి సంబంధం లేదని కొట్టి పారేసింది. ప్రతి అంశాన్నీ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయజూస్తోందని ఆరోపించింది. కాగా స్థానికులకు ఈ విమానాశ్రయ నిర్మాణం కుతూహలాన్ని కలిగిస్తోంది. దేశంలో మరెక్కడా ఈ విధమైన ఈ షేపులో విమానాశ్రయం లేదని వారు అంటున్నారు. ఇది ఒక పార్టీ గుర్తు అని తాము భావించడం లేదని వారు చెప్పారు.

ఇలా ఉండగా సీఎం ఎడ్యూరప్ప ఈ విమానాశ్రయ నిర్మాణంపై ఆసక్తి చూపుతున్నారు. గత ఫిబ్రవరిలో ఆయన ఈ స్థలాన్ని సందర్శించి వచ్చే సంవత్సరాంతానికి ఇది పూర్తి కావాలని అదేశించడమే గాక.. ప్రతి రెండు నెలలకొకసారి తాను ఇక్కడికి వచ్చి నిర్మాణ పనులను చూస్తానని చెప్పారు. దీని నిర్మాణ పనులను చేపట్టిన కంపెనీ ప్రతినిధులతో కూడా అయన సమావేశమయ్యారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Electric Vehicles: మన దేశంలో రానున్న మూడేళ్ళ కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 26 శాతం పెరగొచ్చు..ఆటో నిపుణుల అంచనా!

Koo App: భారతీయ యాప్ ‘కూ’ లో చేరిన అనుష్క..ఇక నుంచి కూ లోనే అన్ని విషయాలను షేర్ చేస్తానన్న దేవసేన

Click on your DTH Provider to Add TV9 Telugu