AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉత్తరాఖండ్‌లో అలజడి.. ఆ పాఠశాల సమీపంలో పేలుడు పదార్థాలు లభ్యం..

ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా దబారా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో 161 జిలెటిన్ స్టిక్స్‌తో కూడిన సుమారు 20 కిలోల పేలుడు పదార్థాలు లభ్యం కావడం కలకలం సృష్టించింది. ప్రిన్సిపల్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, పొదల్లో దాచిన ఈ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. హర్యానా, ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌లలో జరిగిన ఘటనల నేపథ్యంలో, ఈ పేలుడు పదార్థాలను ఎవరు, ఎందుకు తీసుకొచ్చారనే దానిపై విస్తృత దర్యాప్తు జరుగుతోంది.

ఉత్తరాఖండ్‌లో అలజడి.. ఆ పాఠశాల సమీపంలో పేలుడు పదార్థాలు లభ్యం..
Uttarakhand School Explosives
Jyothi Gadda
|

Updated on: Nov 23, 2025 | 2:04 PM

Share

ఇటీవల జరిగిన ఢిల్లీ పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పేలుడు కేసులో లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలోనే హర్యానా, ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌లలో పేలుడు పదార్థాలకు సంబంధించిన సంఘటనలు మరువకముందే.. ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా దబారా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల సమీపంలో అనుమానాస్పద ప్యాకెట్లు లభ్యమయ్యాయి.

పాఠశాల ప్రిన్సిపల్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. స్కూల్ ఆవరణలోని పొదల్లో దాచిన 161 జిలెటిన్ స్టిక్స్‌ను (సుమారు 20 కిలోలు) స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలను గ్రామంలోకి ఎవరు, ఎందుకు తీసుకొచ్చారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us