Provident Fund: ఉద్యోగులకు అలర్ట్.. కేంద్రం కొత్త నిర్ణయం.. పీఎఫ్‌లో భారీ మార్పులు
కేంద్రం కొత్తగా కొద్ది రోజులు క్రితం తీసుకొచ్చిన కార్మిక సంస్కరణల వల్ల పీఎఫ్‌లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదే కాకుండా ESIC కవరేజ్ విషయంలో పలు మార్పులు జరిగాయి. కొత్త రూల్స్ వల్ల ఎలాంటి మార్పులు రానున్నాయి..? ఉద్యోగులకు ఎలాంటి భద్రత కలగనుంది..?

New Labour Codes: కేంద్ర ప్రభుత్వం పాతవాటిల్లో మార్పులు చేసి కొత్త కార్మిక సంస్కరణలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఉద్యోగుల భద్రత కోసం కొత్త సంస్కరణల్లో కీలక మార్పులు తెచ్చింది. ఏ రంగంలో పనిచేసేవారికైనా సరే తప్పనిసరిగా అపాయింట్‌మెంట్ లెటర్, సకాలంలో జీతం, హెల్త్ చెకప్, మహిళలకు నైట్ షిఫ్ట్ కల్పన వంటి సంస్కరణలు ప్రవేశపెట్టింది. పీఎఫ్, ఈఎస్‌ఐసీ కూడా అందరికీ వర్తింపజేయాలనే నిబంధన తీసుకొచ్చింది. దీంతో పీఎఫ్, ఈఎస్‌ఐసీలో ఎలాంటి మార్పులు జరగనున్నాయో చూద్దాం.
పీఎఫ్‌లో మార్పులేంటి..?
కొత్త మార్పుల ప్రకారం పీఎఫ్ ఫుల్ టైమ్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, టెంపలరీ వర్కర్స్‌కి కూడా వర్తింపచేయాలి. ఇప్పటివరకు కొన్ని కంపెనీలు పీఎఫ్ సౌకర్యం కల్పించేవి కాదు. కానీ కొత్త లేబర్ కోడ్‌ల ప్రకారం ప్రతీ కంపెనీ ఉద్యోగికి పీఎఫ్ సౌకర్యం కల్పించాల్సిన అవసరముంది. ఏ రంగంలో పనిచేసే ఉద్యోగికైనా పీఎఫ్ తప్పనిసరి చేసింది.
ESIC కవరేజ్
గతంలో ఎక్కువ శాలరీ ఉన్న ఉద్యోగులకు ESIC కవరేజ్ ఉండేదికాదు. కానీ ఇప్పుడు అందరికీ ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. 10 మంది కంటే తక్కువమంది ఉద్యోగులు ఉండే కంపెనీ స్వచ్చంధంగా దీనిని ఎంపిక చేసుకోవచ్చు. ప్రమాదకర రంగాల్లో పనిచేసేవారికి ESIC కవరేజ్ తప్పనిసరి చేశారు. ఇక తోటల పెంపకం, గని, బీడీ, డాక్, గ్రామీణ కార్మికులకు వైద్య సౌకర్యాలు కల్పించాలి. కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఖచ్చితంగా ESIC తప్పనిసరి. ఇక అపాయింట్‌మెంట్ లెటర్ అనేది తప్పనిసరిగా రాతపూర్వకంగా ఇవ్వాలి. పీఎఫ్, ESIC ప్రక్రియలకు ఇది ఉపయోగపడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




