CIBIL Score: మీ సిబిల్ స్కోర్‌లో తప్పులు ఉంటే ఏం చేయాలి..? ఎలా, ఎక్కడ సరిచేసుకోవాలి..?
సిబిల్ స్కోర్‌లో మిస్టేక్‌లు చాలా ఉంటాయి. ఏమీ కాదులే అని వదిలేస్తే మీకే నష్టం. సరిచేసుకోకపోతేప మీ సిబిల్ స్కోర్ తగ్గడంతో పాటు మీకు లోన్లు వచ్చే అవకాశం ఉండదు. అందుకే సిబిల్ స్కోర్ నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాలని బ్యాంకింగ్ రంగం నిపుణులు చెబుతున్నారు.

CIBIL Check: బ్యాంకింగ్ రంగం టెక్నాలజీని అందిపుచ్చుకున్న నేపథ్యంలో ప్రతిఒక్కరికీ సిబిల్ స్కోర్ ఎంత ముఖ్యమైనది మనందరికీ తెలిసిందే. మీకు అత్యవసరంగా ఏదైనా లోన్ కావాలన్నా.. సిబిల్ స్కోర్ చాలా అవసరం. పర్సనల్, హోమ్ లోన్ లేదా క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా.. మీ అర్హతలను గుర్తించడానికి బ్యాంకులు ముందు సిబిల్ స్కోర్‌ను చెక్ చేస్తాయి. సిబిల్ స్కోర్ మినిమం 750 వరకు ఉండాలి. 750 కంటే తక్కువగా ఉండే ఏ బ్యాంకులు లోన్లు లేదా క్రెడిట్ కార్డులు మంజూరు చేయవు. మనం ఆర్ధికంగా బలంగా ఉన్నామా.. లేదా అనేది మీ సిబిల్ స్కోర్ చెక్ చేస్తే ఎవరైనా ఈజీగా తెలిసిపోతుంది. అందుకే సిబిల్ స్కోర్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.
రెగ్యూలర్‌గా సిబిల్ స్కోర్ చేసుకోవడం వల్ల ఏమైనా తప్పులు ఉంటే వెంటనే తెలిపిపోతుంది. మీ వ్యక్తిగత, అకౌంట్ వివరాలు తప్పుగా ఉన్నా, లేట్ పేమెంట్స్ తప్పుగా ఎంటర్ అయినా లేదా ఇతర ఆర్ధిక మోసాలను సిబిల్ స్కోర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏమైనా తప్పులు కనిపిస్తే వెంటనే బ్యాంక్‌లను సంప్రదించి సరిచేసుకోవచ్చు.
క్రెడిట్ స్కోర్ ఎలా చూసుకోవాలి..?
దేశంలోని ప్రతీఒక్కరూ ప్రతి సంవత్సరం ఒకసారి నాలుగు ఆర్‌బీఐ అధీకృత బ్యూరోల నుంచి ఉచితంగా సిబిల్ స్కోర్‌ను పొందేందుకు అర్హులు. సిబిల్, సీఆర్‌ఐఎఫ్, Experian లేదా Equifax వంటి పోర్టల్స్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఆ వెబ్‌సైట్లలోకి లాగిన్ అయి మీ వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయా.. లేదా అనేది తెలుసుకోవచ్చు. ఏమైనా తప్పులు ఉంటే సంబంధిత క్రెడిట్ బ్యూరోు నివేదించవచ్చు. రిక్వెస్ట్ పెట్టిన తర్వాత కొద్దిరోజుల్లో మార్పులు జరుగుతాయి. ఇక కొన్ని ఫ్లాట్‌ఫామ్‌లు ఉచితంగా తమ కస్టమర్లకు సిబిల్ స్కోర్ రిపోర్టులు అందిస్తున్నాయి.
రిపోర్ట్‌ను ఎలా పరిశీలించాలి..?
-పేరు, పాన్, ఆధార్ నెంబర్, అడ్రస్ వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయో.. లేదో చూసుకోండి
-మీ బ్యాంక్ వివరాలు, లోన్లు, కార్డు, బకాయిలు, ఈఎంఐ వివరాలు చూసుకోండి
-లోన్ మొత్తం చెల్లించాక ఆ లోన్ క్లోజ్ అయిందా.. లేదా అనేది చూడండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




