AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? అత్యధిక వడ్డీ ఇస్తున్న టాప్ బ్యాంకులు ఇవే.. ఒకసారి చూడండి

ఒక్కో బ్యాంక్ ఒక్కొలా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకుల్లో తక్కువగా ఉండగా.. మనికొన్ని బ్యాంకుల్లో ఎక్కువగా ఉన్నాయి. కాలపరిమితిని బట్టి బ్యాంకులు వడ్డీని అందిస్తున్నాయి. ప్రస్తుతం ఏయే బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి..? సీనియన్ సిటీనన్లకు ఎలా ఉంది? అనే వివరాలు చూద్దాం.

Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? అత్యధిక వడ్డీ ఇస్తున్న టాప్ బ్యాంకులు ఇవే.. ఒకసారి చూడండి
Fixed Deposit
Venkatrao Lella
|

Updated on: Nov 23, 2025 | 12:50 PM

Share

FD interest rates: డిజిటల్ కాలంలో డబ్బులు పొదుపు చేసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. యూపీఐ, NFBC, బ్యాంక్ యాప్స్ రాకతో ఫోన్‌ నుంచే డబ్బులు పొదుపు చేసుకునే వెసులుబాటు లభించింది. ఆర్‌బీఐ అనుమతితో నడుస్తున్న లోన్స్ యాప్స్ కూడా ఫిక్స్ డ్ డిపాజిట్, టర్న్మ్ డిపాజిట్ వంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇలాంటి యాప్స్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు డిపాజిట్లపై బ్యాంకులను మించి అత్యధిక వడ్డీ ఇస్తున్నాయి. వీటికి పోటీగా బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఫిక్స్ డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల గురించి తెలుసుకుందాం.

హెచ్‌డీఎఫ్‌సీ

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు కల్పిస్తోంది. రెగ్యూలర్ సిటిజన్లకు మూడు సంవత్సరాల కాలపరిమితి ఉండే ఫిక్స్ డ్ డిపాజిట్లపై 6.95 శాతం అందిస్తుండగా.. సీనియర్ల సిటీజన్లకు 6.95 శాతం అందిస్తుంది. ఇక 18 నుంచి 21 నెలల కాలపరిమితి ఉంటే అత్యధిక వడ్డీని ఇస్తోంది

ఐసీఐసీఐ బ్యాంక్

ఇక ఐసీఐసీఐ బ్యాంక్ మూడేళ్ల కాలపరిమితి ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లపై 6.6 శాతం వడ్డీని ఇస్తోంది. ఇక సీనియర్ సిటీజన్లకు ఇది 7.2 శాతంగా ఉంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్

ఈ బ్యాంక్ మూడు సంవత్సరాల కాలపరిమితి ఉన్న డిపాజిట్లపై 6.4 శాతం ఇస్తుండగా.. సీనియర్ సిటిజన్లకు 6.9 శాతం ఇస్తోంది. ఇక 391 రోజుల నుంచి రెండు సంవత్సరాల కంటే కాలపరిమితి తక్కువ ఉంటే 6.7 శాతం నుంచి 7.2 శాతం వరకు వడ్డీ కల్పిస్తోంది.

ఫెడరల్ బ్యాంక్

ఇక ఫెడరల్ బ్యాంక్ మూడు సంవత్సరాల ఫిక్స్ డ్ డిపాజిట్లక 6.7 శాతం సాధారణ వ్యక్తులకు, సీనియర్ సిటిజన్లకు 7.2 శాతం వడ్డీ ఇస్తోంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

మూడేళ్ల డిపాజిట్లపై సాధారణ వ్యక్తులకు 6.3 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.8 శాతం అందిస్తోంది. ఇక రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్య కాలపరిమితిపై 6.45 శాతం నుంచి 6.95 శాతం మధ్య వడ్డీ ఇస్తోంది.

కెనరా బ్యాంక్

ఈ బ్యాంక్ సాధారణ పౌరులకు మూడు సంవత్సరాల కాలపరిమితిపై 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం అందిస్తోంది. ఇక 445 రోజు కాలపరిమితి ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లపై 6.5 నుంచి 7 శాతం వడ్డీ ఇస్తోంది.

యూనియన్ బ్యాంక్

ఈ బ్యాంక్ సాధారణ పౌరులకు మూడు సంవత్సరా డిపాజిట్‌పై 6.6 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.1 శాతం వడ్డీని అందిస్తోంది.

మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..