Bank Accounts:మీ పాత బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అలాగే ఉండిపోయాయా..? RBI గుడ్‌న్యూస్.. వెంటనే వెళ్లండి
ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. పాత అకౌంట్లోని డబ్బులను తిరిగి క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇందుకోసం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ప్రత్యేక డ్రైవ్ నడుపుతోంది. మీ పాత అకౌంట్లో డబ్బులు ఉన్నట్లయితే వెళ్లి తీసుకోవచ్చు. ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అంటే..?

RBI: వేర్వేరు అవసరాల కోసం వివిధ రకాల బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేస్తూ ఉంటాం. సేవింగ్ అకౌంట్స్, శాలరీ అకౌంట్, ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఒక అకౌంట్.. ఇలా వేర్వేరు అకౌంట్లు ఉపయోగిస్తూ ఉంటాం. కొన్ని రోజుల తర్వాత అవసరం లేకపోతే వాటిని వదిలేసి ఒకే ఒక అకౌంట్‌ను వాడుతూ ఉంటాం. ఇలాంటి సమయంలో పాత అకౌంట్లలో ఉన్న డబ్బులను మార్చిపోతూ ఉంటాం. కొన్ని సంవత్సరాల పాటు అకౌంట్ వాడకపోతే ఆటోమేటిక్‌గా డీయాక్టివేట్ అవుతుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి..? పాత అకౌంట్లో ఉన్న డబ్బులను ఎలా తీసుకోవాలి? అనే విషయాలు చూస్తే..
మీరు 10 సంవత్సరాల పాటు బ్యాంక్ అకౌంట్ నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేకపోతే అది డీయాక్టివేట్ అవుతుంది. అందులోని డబ్బులు ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన డాపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌కి వెళతాయి. గత ఏడాది మే 24 నుంచి ఈ ఫండ్ అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా 10 ఏళ్లకుపైగా బ్యాంక్ అకౌంట్ వాడని వారి అకౌంట్లోని డబ్బులు ఇందులోకి బదిలీ అయ్యాయి. . ఈ ఫండ్‌లోకి వెళ్లాక కూడా మన అకౌంట్లోని డబ్బులను తీసుకోవచ్చు. అదెలా అంటే..
క్లెయిమ్ ఎలా చేసుకోవాలంటే..?
-ఆర్‌బీఐ యూడీజిఏఎమ్ పోర్టల్ udgam.rbi.org.in/unclaimed-deposits లింక్‌ను ఓపెన్ చేయండి
-మీ పాన్, ఆధార్ లేదా మీ నేమ్‌తో లాగిన్ అవ్వండి
-అక్కడ మీ పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్లు, బ్యాంచ్ వివరాలు కనిపిస్తాయి
-మీ బ్యాంచ్ బ్రాంచ్‌కి వెళ్లి కేవైసీ పూర్తి చేసుకుని క్లెయిమ్ ఫారంను నింపండి
-బ్యాంకువారు తిరిగి మీ డబ్బులను అందిస్తారు
-క్లెయిమ్ చేసుకోవడానికి ఎలాంటి టైం లిమిట్ లేదు




