- Telugu News Photo Gallery Drumstick a superfood for hydration skin and overall wellness news in telugu lifestyle news
ఏది ఏమైనా వీటిని పక్కన పెట్టకండి.. 300లకు పైగా రోగాలను నయం చేసే రామబాణం
ఎండాకాలంలో ఎక్కువగా లభించే మునగకాయ ఈ సీజన్‌లో కాస్త తక్కువగానే దొరుకుతాయి. కానీ, రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఏ, ఫ్రీ రాడికల్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి. మునగాలోని పోషకాలు మన చర్మం యవ్వనంగా కనిపించేలా మెరిసేలా చేస్తుంది. మునగకాయలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖంపై ఉండే యాక్నేను తగ్గించేస్తుంది. అంతేకాదు ముఖంపై ఉన్న దురదలు ఉంటే తొలగించేస్తుంది. మచ్చలు, గీతలు నివారించే గుణం మునగకాయలో ఉన్నాయి.
Updated on: Nov 23, 2025 | 1:01 PM

మునగకాయను తరచూ మన డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులో ఉండే ఐరన్, విటమిన్ సి, కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. అంతేకాదు రక్త సరఫరాను మెరుగు చేస్తుంది. మునగ కాయలతో జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. రెగ్యులర్ డైట్ లో మునగకాయ పప్పు లేదా కూర రూపంలో తీసుకోవచ్చు.

మునగకాయలో మెగ్నీషియం, విటమిన్ బి స్ట్రెస్ ను తగ్గిస్తుంది. అంతే కాదు నిద్ర లేమి సమస్యకు చెక్ పెడుతుంది. మూడ్ స్వింగ్స్ తో బాధపడుతున్న వారు మునగకాయ తీసుకోవాలి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, కొలెస్ట్రాల్ తగ్గించేస్తుంది. హైపర్ టెన్షన్ సమస్యతో బాధపడుతున్న వారు మునక్కాయలు తీసుకోవాలి.

కాలేయ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆస్తమా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మునగకాయ తీసుకోవాలి. మునగకాయలో న్యూట్రియన్స్ ఉంటాయి. ఇది ఈస్ట్రోజన్ సహాయకరంగా ఉంటాయి. మెటబాలిజం రేటును పెంచి హార్మోనల్ అసమతుల్యత సమస్యను తగ్గించేస్తుంది.

మునగకాయలో క్యాల్షియం, ఐరన్, జింక్, సెలినియం ఉంటుంది. ఇది రుమటాయిడ్ ఆర్థరైటీస్ సమస్యకు ఎఫెక్టివ్ రెమిడీ. కీళ్లనొప్పులతో బాధపడేవారు మునక్కాయలు తీసుకోవాలి. డయాబెటిస్ రోగులకు కూడా మునగకాయ మంచిది. ఇది బీపీ సమస్యను తగ్గించి కిడ్నీ ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది.

థైరాయిడ్ తో బాధపడే వారికి కూడా మునగకాయ వరం. మునగకాయలో యాంటీ ఇన్‌ఫ్లమేషన్ గుణాలు ఉంటాయి. ఇది ఎముకలు ఆరోగ్యంగా ఉంచేలా ప్రేరేపిస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. డయాబెటిస్ రోగులకు వరం.




