Uttarakhand: వాటర్ ట్యాంక్ ఎక్కి.. తుపాకీతో కాల్చుకుని మాజీ మంత్రి ఆత్మహత్య.. అదే కారణమా

ఉత్తరాఖండ్(Uttarakhand) మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ(Rajendra Bahuguna) ఆత్మహత్య చేసుకున్నారు. నివాస ప్రాంతానికి సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి, తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. లైంగిక ఆరోపణల....

Uttarakhand: వాటర్ ట్యాంక్ ఎక్కి.. తుపాకీతో కాల్చుకుని మాజీ మంత్రి ఆత్మహత్య.. అదే కారణమా
Rajendra Bahuguna
Follow us

|

Updated on: May 27, 2022 | 5:57 PM

ఉత్తరాఖండ్(Uttarakhand) మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ(Rajendra Bahuguna) ఆత్మహత్య చేసుకున్నారు. నివాస ప్రాంతానికి సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి, తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. లైంగిక ఆరోపణల కేసులో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని రాజేంద్ర కుటుంబసభ్యులు తెలిపారు. తన కూతురిని వేధిస్తున్నాడంటూ రాజేంద్ర బహుగుణపై ఆయన కోడలు ఫిర్యాదు చేశారు. కోడలు ఫిర్యాదు మేరకు బహుగుణపై పోక్సో చట్టం(Pocso Act) కింద కేసు నమోదైంది. కేసు నమోదవడంతో బహుగుణతీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకునే ముందు పోలీసులకు ఫోన్ చేశారు. తాను బతకలేనని, చనిపోతున్నట్లు చెప్పారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే బహుగుణ ఇంటి ముందు ఉన్న వాటర్‌ ట్యాంక్‌పైకి ఎక్కారు. పోలీసులు అప్రమత్తమై లౌడ్ స్పీకర్ల ద్వారా కిందకు రావలని కోరారు. ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని సూచించారు. తాను ఏ తప్పూ చేయలేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి బహుగుణ తుపాకీతో కాల్చుకున్నారు.

పోలీసులు, స్థానికులు చూస్తుండగానే బహుగుణ ఈ దారుణానికి పాల్పడ్డారు. తన తండ్రి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారంటూ ఆయన కుమారుడు అజయ్ కోడలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బహుగుణ 2004-5లో ఎన్‌డీ తివారీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి