మూడు నెలల పసికందుతో సహా తల్లి అనుమానాస్పద మృతి.. కాలువలో శవాలై తేలిన తల్లీబిడ్డలు

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా తిర్వా ప్రాంతంలోని డ్రెయిన్‌లో తల్లీ బిడ్డల మృతదేహాలు కనిపించడం స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. మూడు నెలల..

మూడు నెలల పసికందుతో సహా తల్లి అనుమానాస్పద మృతి.. కాలువలో శవాలై తేలిన తల్లీబిడ్డలు
Uttar Pradesh Crime
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 11, 2023 | 8:41 PM

లక్నో, సెప్టెంబర్‌ 11: ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా తిర్వా ప్రాంతంలోని డ్రెయిన్‌లో తల్లీ బిడ్డల మృతదేహాలు కనిపించడం స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. మూడు నెలల పసికందును తీసుకుని రాత్రి సమయంలో న్యాప్‌కిన్‌ పడేసేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ తెల్లారేసరికి కాలువలో తల్లీబిడ్డలు శవాలై తేలారు. అసలేం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా తిర్వా కొత్వాలి ప్రాంతంలోని జవహర్ నగర్ మొహల్లాలో నివాసముంటోన్న సురభి (30) అనే మహిళకు 3 నెలల కుమార్తె ఉంది. ఆదివారం రాత్రి నాప్కిన్‌లను బయటపడేసేందుకు ఇంటి నుంచి బయటకు సుర్భి వెళ్లింది. ఏం జరిగిందో తెలియదు గానీ సోమవారం ఉదయం తల్లీ బిడ్డల మృతదేహాలు కాలువలో పడి లభ్యమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు.

కాలువలో పడి ఉన్న తల్లి, పసిబిడ్డల మృతదేహాలు

దీనిపై ఎస్పీ అమిత్‌ కుమార్‌ ఆనంద్‌ మాట్లాడుతూ.. ఈ ఘటనపై కేసు నమోదు చేశాం. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెళ్లడిస్తాం. మహిళ, చిన్నారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించాం. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మృతురాలు సురభికి ఆదివారం రాత్రి తన భర్తతో గొడవ జరిగినట్లు సమాచారం. ఇంటి బయట దంపతులు ఇరువురు గొడవ పడ్డారు. అనతంతరం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సురభి తన కుమార్తెతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లగా, ఉదయం ఇద్దరి మృతదేహాలు కాలువలో పడి ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

పలు కోణాల్లో దర్యాప్తు చేస్తోన్న పోలీసులు

సురభి, ప్రాంజల్ అలియాస్ సింటూకు దాదాపు 7 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. 2 ఏళ్ల తరువాత సురభికి కుమార్తె (5) జన్మించింది. మూడు నెలల క్రితం ఆమె మరో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. సురభి, పసిబిడ్డలది హత్య, ఆత్మహత్య అనే విషయం తేల్చేందుకు పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా మృతురాలి భర్తను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.