Sambhal: సంభల్ మసీదులో ఆలయం ఆనవాళ్లు నిజమేనా..? అసలు నిజాలు బయటపెట్టిన అడ్వొకేట్ కమిషనర్
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంభల్ మసీదులో సర్వేలో సంచలనం విషయాలు బయటపడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జామా మసీదులో ఆలయం ఉందన్న అడ్వొకేట్ కమిషనర్ నివేదిక కలకలం రేపుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్థానిక కోర్టులో సర్వే నివేదికను సమర్పించారు. సంభల్ మసీదు పాత నిర్మాణాన్ని మార్చినట్టు పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ లోని సంభల్‌లో జామా మసీదు సర్వేపై అడ్వొకేట్ కమిషనర్ నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. జామా మసీదులో ఆలయం ఆనవాళ్ల లభించినట్టు అడ్వొకేట్ కమిషనర్ నివేదికలో వెల్లడించారు. మసీదులో కొత్తగా నిర్మాణాలు చేపట్టినట్టు కూడా వెల్లడించారు. అంతేకాకుండా జామా మసీదులో రెండు వటవృక్షాలు అంటే.. మర్రిచెట్లు కూడా ఉన్నట్టు వెల్లడించారు. మసీదులో పెద్ద బావిని కూడా గుర్తించారు. బావి మసీదు లోపల సగం.. బయట సగం ఉన్నట్టు వెల్లడించారు. అంతేకుండా 50 రకాల పూల చెట్లను కూడా గుర్తించారు.
దేశవ్యాప్తంగా సంభల్ మసీదులో సర్వే మీద చర్చ జరుగుతున్న సమయంలో అడ్వొకేట్ కమిషనర్ నివేదిక సంచలనం రేపుతోంది. సంభల్‌లో 1978 నాటి శివాలయం కూడా బయటపడింది. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం కోర్టులో నివేదిక సమర్పించారు. 45 పేజీల నివేదికతోపాటు సర్వేకు సంబంధించిన పెన్‌డ్రైవ్‌ను కోర్టుకు సమర్పించామని, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారమే సర్వే నిర్వహించామని అడ్వొకేట్ కమిషనర్ తెలిపారు.
ఏఎస్ఐ రిపోర్టులోని అంతర్గత వివరాలు వెల్లడైనట్లు సమాచారం. మొదటి రోజు నవంబర్ 19న రెండున్నర గంటల వీడియోగ్రఫీ, రెండో రోజు నవంబర్ 20న మూడు గంటల వీడియోగ్రఫీ చేశారు. మొత్తం నాలుగున్నర గంటల వీడియోగ్రఫీని సర్వే రిపోర్టులో పేర్కొన్నారు. దాదాపు 1200 ఫొటోలు తీశారు. మసీదులో ఆలయానికి సంబంధించిన ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం.
షాహీ జామా మసీదు లోపల రెండు మర్రి చెట్లు ఉన్నాయి. సాధారణంగా హిందూ మతంలో మర్రిచెట్టును దేవాలయాల్లో పూజిస్తారు. మసీదులో సగం లోపల, సగం బయట ఉన్న బావి కూడా ఉంది. బావిలో సగభాగం మసీదు లోపల ఉండగా బయటి భాగాన్ని కప్పి ఉంచారు. 50కి పైగా పూల మొక్కల గుర్తులు కనిపించాయి. గోపురంలో కొంత భాగాన్ని సాదాసీదాగా ఏర్పాటు చేశారు. మసీదు పాత నిర్మాణాన్ని మార్చినట్లు ఆధారాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. కొత్త నిర్మాణానికి సంబంధించిన ఆధారాలు లభించాయి. ఆలయ ఆకారాన్ని ప్లాస్టర్ చేసి పెయింటింగ్ వేశారని కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..