Crime News: దారుణం.. పదం తప్పుగా పలికాడని.. దళిత విద్యార్థిని కొట్టి చంపిన ఉపాధ్యాయుడు..

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఓ ఉపాధ్యాయుడు దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఓ పదం తప్పుగా పలికాడన్న కారణంతో 15ఏళ్ల దళిత విద్యార్థి (Student) ని విచక్షణారహితంగా కొట్టాడు.

Crime News: దారుణం.. పదం తప్పుగా పలికాడని.. దళిత విద్యార్థిని కొట్టి చంపిన ఉపాధ్యాయుడు..
Uttar Pradesh
Follow us

|

Updated on: Sep 27, 2022 | 6:05 AM

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఓ ఉపాధ్యాయుడు దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఓ పదం తప్పుగా పలికాడన్న కారణంతో 15ఏళ్ల దళిత విద్యార్థి (Student) ని విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో బాలుడు ఆసుపత్రి పాలై చనిపోయాడు. 19 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాలుడు.. సోమవారం తుదిశ్వాస విడిచాడు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఔరియా జిల్లాలో జరిగింది. నిఖిత్ దోహ్రే అనే బాలుడు శనివారం రాత్రి రాష్ట్రంలోని ఇటావా జిల్లాలోని ప్రత్యేక ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరణించినట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబరు 7న సాంఘిక శాస్త్ర పరీక్షలో ఒక పదం తప్పుగా ఉచ్ఛరించడంతో ఉపాధ్యాయుడు (teacher) అశ్విని సింగ్.. తన కుమారుడిపై కర్రలు, రాడ్‌లతో దాడి చేశాడని, దీంతో నిఖిత్‌ స్పృహతప్పి పడిపోయాడని బాలుడి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. కులం పేరుతో కూడా దూషించినట్లు వెల్లడించారు.

పోలీసులు తెలిపారు. విద్యార్థి నిఖిత్‌ దోహ్రే స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. క్లాస్‌ టెస్టులో నిఖిత్‌ ఓ పదాన్ని తప్పుగా పలికాడని ఆగ్రహించిన ఉపాధ్యాయుడు అశ్విని సింగ్‌.. విద్యార్థిని విచక్షణారహితంగా కోట్టాడు. అంతటితో ఆగకుండా కాలితో తన్నుతూ తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బాలుడు స్పృహతప్పిపడిపోయాడు. వెంటనే సిబ్బంది అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి కుటుంబం హుటాహుటిన ఆ ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం బాలుడు స్పృహ కోల్పోయి స్ట్రెచర్‌పై ఉండటాన్ని రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. వీడియోలు వైరల్‌గా మారాయి. అప్పటినుంచి చికిత్స పొందుతున్న విద్యార్థి సోమవారం చనిపోయాడు.

అయితే.. బాలుడి చికిత్స కోసం టీచర్ మొదట రూ.10,000 ఇచ్చారని , ఆ తర్వాత మరో రూ.30,000 ఇచ్చారని బాలుడి తండ్రి తెలిపాడు. ఆ తర్వాత టీచర్‌ నుంచి ఫోన్ కాల్స్ రాలేదని తండ్రి ఆవేదన వ్యక్తంచేశారు. కుల దూషణలతో దూషించాడని బాలుడి తండ్రి చెప్పాడు. కాగా.. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఔరయ్య పోలీసు చీఫ్ చారు నిగమ్ తెలిపారు. పలు సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశామని.. పరారీలో ఉన్న ఉపాధ్యాయుడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి