Wonder: కరోనాతో అమ్మ చనిపోతే అడుక్కుతింటున్న చిన్నోడు.. ఊహించని రీతిలో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు..

మాయదారి కరోనా.. ఆ అబ్బాయి తల్లిని కూడా మింగేసింది. అప్పటి వరకు అమ్మ ఒడిలో హాయిగా జీవిస్తూ వచ్చిన ఆ బాలుడు.. తల్లి మృతితో అనాధగా మారాడు. జీవితమంటే ఏంటో కూడా తెలియని ఆ అబ్బాయిని నా అన్న వారు ఎవరూ లేకపోవడంతో

Wonder: కరోనాతో అమ్మ చనిపోతే అడుక్కుతింటున్న చిన్నోడు.. ఊహించని రీతిలో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు..
Boy Becomes Millionaire
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 17, 2022 | 7:03 PM

మాయదారి కరోనా.. ఆ అబ్బాయి తల్లిని కూడా మింగేసింది. అప్పటి వరకు అమ్మ ఒడిలో హాయిగా జీవిస్తూ వచ్చిన ఆ బాలుడు.. తల్లి మృతితో అనాధగా మారాడు. జీవితమంటే ఏంటో కూడా తెలియని ఆ అబ్బాయిని నా అన్న వారు ఎవరూ లేకపోవడంతో చివరకు రోడ్డున పడి బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి రోజూ తన కడుపు నింపుకోవడానికి బిచ్చమెత్తుకునే వాడు. కానీ, ఆ బాలుడి కష్టాలు చూసి ఆ దేవుడికే జాలి పుట్టినట్లుంది. రాత్రికి రాత్రే కోట్ల విలువైన ఆస్తికి యజమాని అయ్యాడు ఆ బాలుడు. ఊహించని రీతిలో అతనికి భారీగా ఆస్తి దక్కింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని డెహ్రానూన్‌లో వెలుగు చూసింది.

ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాలోని పండోలి గ్రామానికి చెందిన ఇమ్రానా భర్త నవేద్ అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆమెకు 10 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే, అత్తింటి వారి వేధింపులు ఎక్కువ అవడంతో.. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. 2019లోనే తన కొడుకు షాజెబ్‌తో కలిసి కలియార్‌లోని తన పుట్టింటికి వెళ్లింది. అయితే, విధి వారిని వెంటాడింది. కరోనా మహమ్మారి.. ఇమ్రానా ను కబలించింది. ఇమ్రానా మృతి తరువాత షాజెబ్ అనాధ అయ్యాడు. ఏం చేయాలో దిక్కుతోచక, నా అన్నవారు లేక దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నాడు. గత్యంతరం లేక రోడ్డుపై బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగించాడు. అయితే, ఇంతకాలంలో అతను పడిన అవస్థలు చూసి ఆ దేవుడికే గుండె బరువెక్కిందేమో. ఇక తట్టుకోలేక.. ఆ బాలుడిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేశాడు.

అవును, ఆ బాలుడికి తన తండ్రి కుటుంబం ద్వారా వారసత్వ ఆస్తి లభించింది. షాజేబ్ తాత మహ్మద్ యాకూబ్ రెండేళ్ల క్రితం చనిపోయాడు. అయితే యాకూబ్ చనిపోయే ముందు.. తన ఆస్తిలో సగం వాటాను అబ్బాయి షాజేబ్ పేరు మీద రాశాడు. ఐదు బిగాల భూమి, ఓ ఇల్లును షాజేబ్ పేరిట రాశాడు యాకూబ్. దాంతో అతని కుటుంబ సభ్యులు.. షాజేబ్ కోసం తీవ్రంగా గాలించారు. సోషల్ మీడియాలో ప్రకటన కూడా ఇచ్చారు. ఇంతలో కలియార్ వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ తిరుగుతున్నాడని సమాచారం అందుకున్నారు బందువులు. ఆ సమాచారం మేరకు అక్కడికి వెళ్లి బాలుడిని ఆరా తీయగా.. అసలు విషయం తెలిసిందే. దాంతో అతన్ని తిరిగి ఇంటికి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు. దాంతో షాజేబ్ దుర్భర జీవితం నుంచి బయటపడ్డాడు. కాగా, ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..