Delhi NCR: మరీ ఇంత కిరాతకంగా ఉన్నారేంట్రా.. నమ్మించి మహిళ కిడ్నీ దోచేశారు.. కట్ చేస్తే సీన్ ఇలా..

ఆసుపత్రి సిబ్బంది కూడా సహకరించారని బాధిత మహిళ ఆరోపించింది. నిందితుడితో ఆసుపత్రి సిబ్బంది కుమ్మక్కయ్యారని బాధిత మహిళ వాపోయింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులను ఆశ్రయించింది.

Delhi NCR: మరీ ఇంత కిరాతకంగా ఉన్నారేంట్రా.. నమ్మించి మహిళ కిడ్నీ దోచేశారు.. కట్ చేస్తే సీన్ ఇలా..
మూత్రం విసర్జించే స‌మ‌యంలో మంట లేదా నొప్పి ఉంటే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు అనుమానించాలి. అలాగే పక్కటెముకల క్రింద వైపు, వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది.
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 17, 2022 | 7:10 PM

నీ భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించిన కొందరు కేటుగాళ్లు..ఆ మహిళ కిడ్నీని దొంగిలించారు. ఇందుకోసం నిందితులు మహిళ పేరిట నకిలీ ఆధార్ కార్డును తయారు చేశారు. కిడ్నీ మార్పిడి చేయించుకున్న రోగికి బాధిత మహిళనే భార్యగా చూపించేందుకు నకిలీ మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా క్రియేట్‌ చేశారు. భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తారనే ఆశతో సదరు మహిళ నిందితుల వలలో చిక్కుకుంది. కానీ, ఆ తర్వాత ఆమె భర్తకు ఉద్యోగం రాలేదు. తన కిడ్నీ పోయింది. మోసాన్ని గుర్తించిన బాధితురాలు బోరుమంటూ పోలీసులను ఆశ్రయించింది. పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో హోడల్‌లోని సౌహద్ గ్రామానికి చెందిన రింకీ సౌరోత్, పెళ్లయినప్పటి నుంచి తన భర్తతో కలిసి బల్లాభ్‌గఢ్‌లో నివసిస్తున్నారు. రెండేళ్ల క్రితం, కిడ్నీ దానం చేయమని కోరుతూ తన భర్త ఫేస్‌బుక్ ఖాతాలో ఒక ప్రకటన చూసింది. ఆ ప్రకటనపై క్లిక్ చేసింది. ఆ తర్వాత కొంతమంది రింకీని ఫోన్‌లో సంప్రదించి కిడ్నీ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.. కిడ్నీ దానం చేసేందుకు రింకీ నిరాకరించింది. కానీ, వారు విడిచిపెట్టలేదు.ఆ తర్వాత వారు రింకీతో ఫేస్‌బుక్‌ ద్వారా సన్నిహితంగా ఉంటూ ఉన్నారు. ఈక్రమంలనే ఆమె కిడ్నీకి బదులుగా తన భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని బురిడీ కొట్టించారు. పర్మినెంట్ ఉద్యోగం గురించి విన్న ఆమె ఆ వ్యక్తుల వలలో పడి తన కిడ్నీని దానం చేయడానికి అంగీకరించినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన కేసులో పేర్కొంది.

అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు మాత్రమే కిడ్నీ ఇవ్వగలరని నిందితులు తెలిపారు. ఇందుకోసం కొన్ని పత్రాలు సిద్ధం చేసుకోవాలన్నారు. దీనికి రింకే ఆమోదం తెలిపారు. ఢిల్లీకి చెందిన వినోద్ మంగోత్రా అనే వ్యక్తికి కిడ్నీని అమర్చాల్సి ఉంది. నిందితులు రింకీకి చెందిన నకిలీ ఆధార్ కార్డు, పేషెంట్ వినోద్ భార్య అంబికా పేరుపై వివాహ ధ్రువీకరణ పత్రాన్ని పొందారు. దీని తరువాత, నిందితుడు రింకీ, రోగి వినోద్‌లతో చాలా ఆసుపత్రులలో మార్పిడి కోసం సంప్రదించారు. అనుమానాస్పద కేసు కారణంగా, చాలా ఆసుపత్రులు కిడ్నీ మార్పిడిని నిరాకరించాయి. రింకీ కిడ్నీని ఫరీదాబాద్ సెక్టార్-16లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వినోద్‌కు అమర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆసుపత్రి సిబ్బంది కూడా సహకరించారని బాధిత మహిళ ఆరోపించింది. నిందితుడితో ఆసుపత్రి సిబ్బంది కుమ్మక్కయ్యారని మహిళ ఆరోపించింది.

ఇవి కూడా చదవండి

కేసు దర్యాప్తు చేస్తున్న ఓల్డ్ ఫరీదాబాద్ ఏసీపీ మహేంద్ర వర్మ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో మహిళ ఫిర్యాదుపై పోలీసు కమిషనర్ వికాస్ అరోరా మాట్లాడుతూ.. విచారణ, చట్టపరమైన చర్యల కోసం ఏసీపీ ఓల్డ్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పోలీసు ప్రతినిధి సుబే సింగ్ తెలిపిన వివరాలు, మహిళ ఫిర్యాదు ప్రకారం.. ఆస్పత్రి సిబ్బందితో సహా ఆరుగురు నిందితులు ఈ కేసులో ఉన్నారు. ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. ఇందులో  ఆసుపత్రి నెఫ్రో విభాగం అధిపతి, కోఆర్డినేటర్ పేరు కూడా ఉంది. నిందితులపై మానవ అవయవ మార్పిడి చట్టం, మోసం, కుట్ర, నకిలీ పత్రాలు తయారు చేయడం, చంపుతామని బెదిరించడం వంటి పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?