Wife kills husband: మహానటిని మించి పోయింది.. భర్తను హత్య చేయించి ఓవర్ యాక్షన్.. అదిరిపోయే ట్విస్ట్.
భర్త ఆటో డ్రైవర్. కిరాయిలకు బయటకు వెళ్తూ ఉంటాడు. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య.. భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది. ప్రియుడితోనే జీవితం పంచుకోవాలని డిసైడయ్యింది.
సీతమ్స్ కాలేజీ సమీపంలో ఆటో డ్రైవర్ వడివేలు దారుణ హత్యకు గురయ్యాడు. గొంతుకోసి దారుణంగా చంపేశారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆ సమయంలోనే అక్కడి వచ్చిన వడివేలు భార్య సెల్విరాణి భర్త మరణాన్ని చూసి బావురుమంది. తన పతి దేవుడ్ని చంపేశారంటూ గుండెలు బాదుకుంది. ఆమె ఏడ్వటం చూసినవాళ్లు అందరూ అయ్యో పాపం అనుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. డెడ్‌బాడీని ప్రభత్వాస్పత్రికి తరలించి.. పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసును ఛాలెజింగ్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. సెల్వరాణి కాల్ డేటా అసలు మేటర్ మొత్తం బయటపెట్టింది. భార్య సెల్విరాణి ప్రేరేపణతోనే హత్య జరిగినట్లు పోలిసుల విచారణలో వెల్లడైంది. ఏంబిఏ కంప్లీట్ చేసిన వినయ్ అనే వ్యక్తితో సెల్వి వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని ఫిక్సయ్యింది. కిరాయి హంతకుల చేత వడివేలును హత్య చేయించేందుకు రెండున్నర లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. అడ్వాన్స్ లక్షన్నర రూపాయలను వినయ్ ద్వారా కిరాయి గ్యాంగ్‌కు పంపింది. డబ్బు చేతికి అందడంతో.. ఆటో బాడుగకు తీసుకెళ్లి మద్యం తాగించి ఆటో డ్రైవర్ వడివేలును గొంతు కోసి హతమార్చారు సుపారి గ్యాంగ్. కేసులో నిందితులు సెల్వరాణితో పాటు, ప్రియుడు వినయ్, నిరంజన్, కిషోర్ అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తి, మోటార్ సైకిల్‌ను సీజ్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..