Trending Video: భారీ ట్రక్కు ఢీకొనడంతో రైల్వే ట్రాక్‌పై నిలిచిన కారు.. ఇంజన్ స్టార్ట్ కాకపోవడంతో.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..!
మృత్యులు ఎప్పుడు ఎలా ఏ వైపు నుంచి దూసుకువస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు నవ్వుతూ సంతోషంగా గడిపిన వారు కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంటారు.
మృత్యులు ఎప్పుడు ఎలా ఏ వైపు నుంచి దూసుకువస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు నవ్వుతూ సంతోషంగా గడిపిన వారు కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. రైల్వే ట్రాక్ వద్ద ఆగిన ఎస్‌యూవీ కారును వెనుక నుంచి యమభటులు తోసినట్లు ట్రక్కు ఢీకొనగా.. ఆరగించేందుకు మృత్యువు ఆరాటపడినట్లు ట్రాక్‌పై రైలు దూసుకొచ్చింది. కానీ, వారి టైమ్ బాగుంది. ఆ దేవుడే వారిని కాపాడాడు. రెప్పపాటులో వారి కారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. రైలు ట్రాక్ క్రాసింగ్ వద్ద గేట్ పడటంతో ఒక SUV కారు ఆగింది. ఇంతలో దూసుకువచ్చిన భారీ ట్రక్కు.. ఆ కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. కారు.. గేట్‌ను దాటుకుని రైల్ ట్రాక్‌పైకి వచ్చింది. ట్రక్కు ఢీకొనడంతో కారు డ్యామేజ్ అయ్యి.. ఇంజిన్ స్టార్ట్ కాలేదు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇంతలో అటువైపు నుంచి ట్రైన్ వస్తుండటంతో.. కారులోని మిగిలిన ప్రయాణికులు కిందకు దిగారు. డ్రైవింగ్ సీట్‌లో ఉన్న వ్యక్తి మాత్రం కారును స్టార్ట్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. చూస్తుండగానే ట్రైన్ దగ్గరకు వచ్చేసింది. కానీ, టైమ్ గాడ్.. రెప్పపాటు వ్యవధిలో కారు స్టార్ట్ అవడం, అక్కడి నుంచి బయటపడటంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు. ఈ ఉత్కంఠభరిత ఘటన అంతా రైల్వే ట్రాక్ పక్కన ఏర్పాటు చేసిన సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ఆ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. నిజంగా దేవుడే వారిని కాపాడాడంటూ కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

