ఆ రాష్ట్రంలో అదుపులోకి వచ్చిన కరోనా కేసులు… అన్ని జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేత…
ఉత్తరప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు అదుపులోకి రావడంతో అన్ని (75) జిల్లాల్లో కరోనా కర్ఫ్యూను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటలవరకు ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఉత్తరప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు అదుపులోకి రావడంతో అన్ని (75) జిల్లాల్లో కరోనా కర్ఫ్యూను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటలవరకు ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూ మాత్రం అన్ని జిల్లాల్లో కొనసాగుతుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. బుధవారం నుంచి ఈ జిల్లాల్లో ఇక పగటి పూట కర్ఫ్యూ ఉండదన్నారు. యాక్టివ్ కేసులు 600 కన్నా తగ్గడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కోవిద్ పరిస్థితిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సమీక్ష నిర్వహించారు. కాగా ఇండియాలో గత 24 గంటల్లో 86,498 కోవిద్ కేసులు నమోదయ్యాయి. 66 రోజుల తరువాత ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే మొదటిసారి. రెండు నెలల అనంతరం లక్ష కన్నా తక్కువగా నమోదు కావడం కూడా ఇదే తొలిసారి.అటు 13 లక్షల యాక్టివ్ కేసులు ఉండగా 2.73 కోట్లమంది రోగులు కోలుకున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 24 గంటల్లో 2,123 మంది రోగులు మృతి చెందినట్టు వెల్లడించాయి. మరణాల రేటు ఇంకా తగ్గవలసి ఉందని భావిస్తున్నట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు దేశంలో 3,51,309 మంది రోగులు మృతి చెందినట్టు ఈ వర్గాలు వెల్లడించాయి.
ఇదే సమయంలో వ్యాక్సిన్ కొరతను తీర్చేందుకు కేంద్రం తీవ్రంగా కృషి చేస్తోందని ఆరోగ్య శాఖ తెలిపింది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మళ్ళీ వేగవంతం చేయాల్సి ఉందని ఈ శాఖ పేర్కొంది. దీనికి సంబంధించిన పాలసీలో మార్పులు చేయడంతో ఇక త్వరలో వ్యాక్సిన్ కొరత తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడదని: Viral Video: నీటి ఒడ్డున జారుడు బల్ల ఆడుతున్న బాతులు.. క్యూట్ వీడియో వైరల్.. నెటిజన్లు ఫిదా..