డ్రైనేజీ పనుల తనిఖీకి మ్యాన్ హోల్ లో దిగిన మహిళా శానిటరీ అధికారి…ఎక్కడంటే ..?
డ్రైనేజీ పనులంటేనే చాలామంది అసహ్యించుకుంటారు. దుర్గంధంతో కూడిన మ్యాన్ హొల్స్ లో దిగి లోపల శుభ్రం చేయాలంటే మున్సిపల్ కార్మికులకు తప్ప మరొకరికి సాధ్యం కాదని అంటారు.
డ్రైనేజీ పనులంటేనే చాలామంది అసహ్యించుకుంటారు. దుర్గంధంతో కూడిన మ్యాన్ హొల్స్ లో దిగి లోపల శుభ్రం చేయాలంటే మున్సిపల్ కార్మికులకు తప్ప మరొకరికి సాధ్యం కాదని అంటారు. కానీ మహారాష్ట్రలో ఓ మహిళా అధికారి మాత్రం అది తప్పని నిరూపించారు. ఆ రాష్ట్రంలోని థానే జిల్లా భివాండీ లో జోరుగా డ్రైనేజీ శుభ్రతా పనులను మున్సిపాలిటీ చేపట్టింది. వర్షాకాల సీజన్ ప్రారంభమైంది గనుక మొదట ఈ పనులకు ప్రాధాన్యమిచ్చారు. ఇందులో భాగంగా భివాండీ-నిజాం పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కి చెందిన ఓ మహిళా శానిటరీ అధికారి.. ఈ పనులు ఎలా జరుగుతున్నాయో ..కాంట్రాక్టర్ ఎలా చేయిస్తున్నాడో తెలుసుకునేందుకు తానే మ్యాన్ హోల్ లోకి దిగి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆమె ఓ నిచ్చెన వేసుకుని మ్యాన్ హోల్ లోకి దిగి తనిఖీ అనంతరం పైకి వచ్చారు. చేనేత మరమగ్గాలు, చేనేత కార్మికులు అధిక సంఖ్యలో ఉన్న భివాండీలో వర్షాకాలం వచ్చిందంటే చాలు…డ్రైనేజీలు నిండిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అందువల్ల ఇప్పటినుంచే ఈ టౌన్ లో వీటిని శుభ్రం చేసేపనిలో కాంట్రాక్టర్లు నిమగ్నమయ్యారు.
చీర కట్టుకున్న ఈ మహిళా అధికారి స్వయంగా మ్యాన్ హోల్ లోకి దిగిన వీడియో వైరల్ అవుతోంది. భివాండీలోని మరి కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ పనులను ఈ అధికారి పర్యవేక్షిస్తున్నప్పటికీ మ్యాన్ హోల్ కి దిగడం విశేషం.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral News: ఆ వ్యాక్సిన్ వేసుకున్న వరుడే కావలెను.. నవ్వులు పూయిస్తున్న వధువు పెళ్లి ప్రకటన..