Viral Video: ప్రియుడితో దొరికిన భార్య.. భర్త ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ప్రస్తుతం వివాహేతర సంబంధాల సీజన్ నడుస్తున్నట్టుంది. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఇలాంటి కేసులు వెలుగులోకి వస్తూ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కారణాలేవైనా స్త్రీ పురుషులు వివాహ బంధాన్ని దాటి వివాహేతర సంబంధాలవైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో వివాహ బంధాన్ని అడ్డుగా భావిస్తున్నారు. ఆ బంధాన్ని తెంచుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలో హత్యలకు కూడా వెనుకాడటంలేదు. ఇలాంటి ఘటనలు ఇటీవల నెట్టింట చాలానే చూస్తున్నాం. అయితే, ఇలాంటి వారికి కనువిప్పు కలిగించేలాంటి ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓవ్యక్తి దగ్గరుండి తన భార్యకు ఆమె ప్రియుడితో వివాహం జరిపించి అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు.

ఉత్తరప్రదేశ్‌లో సంత్ కబీర్ నగర్ జిల్లాలో జరిగిందీ ఘటన. కటర్ జూట్ గ్రామానికి చెందిన బబ్లూ అనే వ్యక్తి 2017లో గోరఖ్‌పూర్‌కు చెందిన రాధికను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒకబాబు, ఒక పాప సంతానం ఉన్నారు. ఉద్యోగ రీత్యా బబ్లూ ఎక్కువ సమయం కుటుంబంతో గడపలేకపోయేవాడు. కుటుంబానికి దూరంగా ఉండేవాడు. ఈ క్రమంలో వికాస్ అనే స్థానిక యువకుడితో రాధికకు పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర బంధానికి దారి తీసింది. వీరి రహస్య బంధాన్ని గమనించిన బబ్లూ భార్యపై కోప్పడలేదు సరికదా.. సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
భార్య పరిస్థితిని అర్థం చేసుకున్న బబ్లూ దనీనాథ్ శివాలయంలో వికాస్‌తో తన భార్య వివాహాన్ని దగ్గరుండి జరిపించాడు. అంతేకాదు, పిల్లల బాధ్యతను కూడా తానే చూసుకుంటానని, ఆమె సంతోషంగా ఉంటే చాలని చెప్పాడు. వికాస్‌తో దండలు మార్చుకుంటున్న సమయంలో రాధిక కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వివాహానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భార్య సంతోషం కోసం బబ్లూ చేసిన త్యాగానికి వారంతా ఫిదా అయిపోయారు. అతను చేసిన పనిని ప్రశంసించారు. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
View this post on Instagram
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..